పూనమ్ బజ్వా బోల్డ్ వీడియో వైరల్….పొదల చాటుకు వెళ్లి …?

వెండి తెర పై ఎప్పుడు పద్దతిగా కనిపించే పూనమ్ బజ్వా, సోషల్ మీడియా లో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ తో, వీడియోస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈమె ఇంస్టాగ్రామ్ లో హాట్ నెస్ కు కేర్ అఫ్ అడ్రస్ ఐపోయింది. ఎప్పుడు బోల్డ్ ఫోటో షూట్స్ తో తన పరువాల అందాలతో కుర్రాళ్లకు ఊపిరాడనివ్వడంలేదు ఈ బ్యూటీ. చాలామంది వెండితెర పై సున్నితమైన పాత్రలు చేసే పూనమ్ తీరు చూసి అవాక్కవుతున్నారు. తాజాగా పూనమ్ మళ్ళి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. బికినీ తో ఆమె చేసిన ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది.

తాజాగా పూనమ్ బికినిలో, తన అందాలను ఆరబోస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిని నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఆమె అందాలను చూసి ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా…పూనమ్ తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి నేటికీ 18 ఏళ్ళు. 2005 నవదీప్ హీరోగా తెరకెక్కిన “మొదటి సినిమా”తో హీరోయిన్ గా పరిచయమయింది పూనమ్. కానీ ఈ చిత్రం అనుకున్న స్థాయి విజయం సాధించలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ, మలయాళీ భాషలలో అనేక చిత్రాలలో నటించింది. కానీ హీరోయిన్ గా తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నాగార్జున, నయనతార జంటగా నటించిన “బాస్” చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది పూనమ్. కానీ ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ “పరుగు” చిత్రంలో హీరోయిన్ అక్కగా నటించింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించినప్పటికీ, ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. అందుకే ఆమెకు ఈ సినిమాలో పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ప్రస్తుతం మలయాళం, కన్నడ పరిశ్రమలలో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది పూనమ్. కొన్నాళ్ల క్రితం దర్శకుడు సునీల్ రెడ్డి ని ఈమె వివాహమాడిందనే వార్తలు వచ్చాయి. కానీ వీరి రిలేషన్ షిప్ పై ఎటువంటి క్లారిటీ లేదు.