” యానిమల్ ” సినిమాలో మూగవాడిగా కనిపించబోతున్న స్టార్ హీరో…!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన కలిసి తాజాగా నటిస్తున్న మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినీ లవర్స్ కు యానిమల్ ఫీవర్ పట్టుకుంది. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ మూవీ మోస్ట్ వైలెంట్ గా ఉండబోతుందట.

ఈ క్రమంలోని అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో బాబీ పాత్ర గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఫిట్ బాడీతో అట్రాక్ చేస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడట. రణబీర్ ను ఢీకొట్టే పాత్రలో అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడట.

అయితే ఈయన ఈ సినిమాలో మూగవాడిగా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బాబీని ప్రశ్నించగా.. అలాంటి పాయింట్స్ రివిల్ చెయ్యకూడదంటూ తప్పించుకున్నాడు. ఇది చాలెంజింగ్ రోల్ అని.. షర్ట్లెస్ గా కనిపించాలి కాబట్టి ఇంగ్లండ్ లో రోజు ఉదయం 5 గంటలకే లేచి జిమ్లో కష్టపడే వాడినని తెలిపాడు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.