ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యా……వైరల్ అవుతున్న శ్రీముఖి కామెంట్స్….!

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది శ్రీముఖి. టీవీ షో లతో, ఓటీటీ షో లతో ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ. అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ, వెండితెర పై ఇంకా బ్రేక్ లభించలేదు శ్రీముఖికి. షూటింగ్ తో, షో లతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఇంస్టాగ్రామ్ బ్రాడ్ కాస్ట్ ఛానెల్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో తన ప్రేమ గురించి, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది శ్రీముఖి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

లవ్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు శ్రీముఖి వెంటనే, బొచ్చెడు సార్లు అని ఠక్కున తన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. పెళ్లి అయ్యాక యాంకర్ గా పని చెయ్యడం మానేస్తారు అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు, పెళ్లి అయ్యాక కూడా తన పనిని కొనసాగిస్తానని క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, కానీ ఎవర్ని, ఎప్పుడు అన్నది మాత్రం సస్పెన్స్ అని సమాధానం ఇవ్వకుండా సున్నితంగా తప్పించుకుంది. ఫాన్స్ తో దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే బ్రాడ్ కాస్ట్ ఛానెల్ పెట్టానని, తన గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుందామనే ఆలోచనతో ఈ పని చేసానని చెప్పింది శ్రీముఖి. ఎవరైనా బాధలో ఉంటె, కాస్సేపు వారిని ఆ బాధలను మర్చిపోయేలా చెయ్యాలని, తాను కూడా కొన్ని క్షణాలపాటు తన పనిని పక్కనపెట్టి రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టానని చెప్పింది శ్రీముఖి.

శ్రీముఖి ప్రస్తుతం డాన్స్ ఐకాన్, సారంగదరియా, ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమాలతో పాటు, ఆహ ఓటీటీ లో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ సీజన్ 2 ప్రోగ్రాం కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.