డేటింగ్ యాప్స్ వాడుతున్న సీనియ‌ర్ సిటిజ‌న్స్‌.. ఈ లేటు వయసులో నిజమైన ప్రేమ‌కోసం..

సాధారణంగా సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ తర్వాత మనవళ్లు, మనవరాళ‌తో శేష‌ జీవితాన్ని గడపాలని భావిస్తూ ఉంటారు. వచ్చిన డబ్బుతో పిల్లల్ని సెటిల్ చేయాలని ఆరాటపడతారు. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్ చాలా మారింది. ఇటీవల కాలంలో వృద్ధులు కూడా డేటింగ్ యాప్ తో నిజమైన ప్రేమను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ఓ సంస్థ quackquack జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

మెట్రో స్మాల్ సిటీస్ కు చెందిన 50 నుంచి 68 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులను మూడు రోజులపాటు సర్వే చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. శేష జీవితాన్ని ఒంటరిగా గడపకుండా కొత్త భాగస్వామిని కనుగొన్నందుకు డేటింగ్ యాప్స్‌ను వృధులు వాడుతున్నారని బయటపడింది. పార్ట్నర్ చనిపోయిన తర్వాత సమాజానికి కట్టుబడి ఒంటరిగా ఉండిపోకుండా సీరియల్ టైప్స్ బ్రేక్ చేస్తున్నారని.. లవ్, రొమాన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఈ సర్వేలో తేలింది.

డేటింగ్ యాప్స్ యూజ్‌ చేస్తున్న వృద్ధులు తమ బయేలో కచ్చితంగా కావాల్సిన రిక్వైర్మెంట్ జోడించి తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకుంటున్నారు. మొత్తానికి డేటింగ్ యాప్స్ డిజైన్ చేసింది యూత్ కోసమే కాదు సీనియర్ సిటిజన్స్ కూడా ఈ యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ సర్వేలో తేలింది. ఈ యాప్స్ ద్వారా నిజమైన ప్రేమతో ఫ్యామిలీ లా ఉండే ఫ్రెండ్స్ నీ అందుకుంటున్నాట్లు పార్టిసిపల్స్ వివరించారు. నిజమైన ప్రేమ కనుగొనడానికి వయసుతో సంబంధం లేదంటూ వీరు చెప్తున్నారు.