ఆడవాళ్లను చూడకూడదని 15 అడుగుల కంచె ఏర్పాటు చేసుకోని 55 ఏళ్లుగా తనని తాను బంధించుకున్నడటా..?!

దయ్యాలకు, దొంగ‌ల‌కి , కొన్ని జంతువుల‌కి బ‌య‌ప‌డ‌టం కామ‌న్‌. ఇంకొంద‌రు దగ్గర నుంచి సముద్రాన్ని చూసిన కూడా భయపడుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడతారా అని చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి ఆడవాళ్లు అంటే భయపడే 55 ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. 71 ఏళ్ల ఈ వింతైన మనిషి పేరు కాలిటెక్స్ నజాంవిట. ఎప్పుడు లోన్లిగానే ఉంటూ ఏ మహిళతో మాట్లాడడం కానీ, గడపడం కానీ ఇప్పటివరకు చేయలేదట. అతడు ఇంటి వైపు వెళ్తున్న ఏ మహిళను చూసిన వెంటనే ఇంట్లోకి వెళ్లి తాళం వేసేసుకుంటాడట.

55 సంవత్సరాల నుంచి తన ఇంటికి తాళం వేసి ఆడవాళ్ళకే కాకుండా, పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అలాగే తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను నిర్మించుకున్నాడని తెలుస్తుంది. అయితే 55 ఏళ్ల నుంచి ఒంటరిగా ఇంట్లో ఉంటే ఫుడ్ ఎలా అనుకుంటున్నారా. పొలిటిక్స్ ఆడవాళ్లకు భయపడిన చుట్టుపక్కల ఉన్న ఆడవారు మాత్రం అతనికి సహాయం చేస్తూనే ఉంటారట. ఎప్పటికప్పుడు కిరాణా సామాను తీసుకువచ్చి ఇస్తారట. ఆడవాళ్ళని ఇంటి ముందుకి కూడా రానివ్వకపోవడంతో వారు ఇంటి బయట నుంచి కిరాణా సామాను అతని ఇంట్లోకి విసిరేస్తారని తెలుస్తుంది.

వారు వెళ్ళాక కొలిటిక్స్ బయటికి వచ్చి ఆ సామాను తీసుకుని వెంటనే ఇంట్లోకి వెళ్లిపోతాడట. ఇంతకీ అతను ఇంతగా మహిళలను చూసి భయపడడానికి కారణం అతనికి ఉన్న గ్రోనోఫోబియా అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు మనసులో ఆడవాళ్లు అంటే చాలా భయపడతారు. కాబట్టి వారితో మాట్లాడటం కానీ, చూడడానికి కానీ అసలు ఇష్టపడరు, మహిళల గురించి ఆలోచిస్తే చాలు ఈ వ్యాధి ఉన్నవారు చాలా టెన్షన్ ఫీలై సత‌మతమవుతూ ఉంటారట. ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడతారట. చాతి బిగుతుగా అయ్యి విపరీతమైన చెమటలు, హార్ట్ బీట్ స్పీడ్ పెరగడం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలా పలు సమస్యలు ఎదురవుతాయట.