అనారోగ్యానికి గురైన శృతిహాసన్.. వీడియో వైరల్..

స్టార్ బ్యూటీ శృతిహాసన్ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన టాలెంట్ తో తనని తాను నిరూపించుకుంటుంది. డాన్స్, యాక్టింగ్ అనే కాకుండా పాటలు కూడా పాడుతూ తన టాలెంట్ ను చూపిస్తుంది. మల్టీ టాస్క్లతో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శృతిహాసన్ ఏదో గుడ్ న్యూస్ చెప్పాలంటుంది.

ఈనెల 26న ఓ శుభవార్త చెబుతానని అందరిని ఊరిస్తుంది. కానీ తాజాగా శృతిహాసన్ ఆనందానికి బ్రేకులు పడ్డాయట. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ చిన్న వీడియోని షేర్ చేసుకుంది. గత నాలుగు రోజులుగా ఫ్లూతో బాధపడుతున్న.. జ్వరంతో పాటు డెంగ్యూ లక్షణాలు కూడా బాగా కనిపిస్తున్నాయి.. దేవుడా ప్లీజ్ అలా మాత్రం చేయకు 26వ తేదీ వరకు అలాంటివేమీ నాకు ఇవ్వద్దు అంటూ వేడుకుంటూ వీడియోను షేర్ చేసింది.

26వ తేదీ వరకు ఇలాంటివి ఏమీ నాకు ఇవ్వద్దు అని శృతిహాసన్ వేడుకోవడంతో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది. మ‌రికొంత మంది ఆమె ఆ రోజు శాంతాన్ హజారికా తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది. అదే గుడ్ న్యూస్ లో ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలనుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే శృతిహాసన్ ప్రస్తుతం ఫ్లూతో బాధపడుతున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆమెకు 26 లోపు అంతా సెట్ అయిపోవాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.