గ్రహణం సమయంలో గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..?

గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే గర్భిణీలు ఆ రోజు కొన్ని నియ‌మాల‌ను త‌ప్ప‌క‌ పాటించాలని.. లేదంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ టైంలో ఎవరు ఏమి తినకూడదని.. తింటే ఏమైనా సమస్యలు వస్తాయని ప్రజలు కూడా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా అన్ని ఆహార పదార్థాల్లో గరిక వేసుకుంటారు. గ్రహణ శూల కారణంగా ఆహార పదార్థాలు విషంలా మారుతాయ‌ని పెద్ద‌లు న‌మ్మ‌తారు. ఆహ‌రంపై ఆ ప్ర‌భావం పడకూడదని ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు.

గ్ర‌హ‌ణం అయిపోయాక దానిని తొలగించి ఆ తరువాతే ఆహారాన్ని తింటారు. అయితే అక్టోబర్ 29న పాక్షిక చంద్రగ్రహణం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది శరత్ పూర్ణిమ సరదృతు ప్రారంభానికి సూచన. అయితే ఈ టైం లో కొన్ని పనులు చేయడం అశుభంగా చాలామంది భావిస్తారు. ముఖ్యంగా గర్భిణులు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. శిశువుపై చెడు ప్రభావం పడకూడదు అంటే గర్భిణీలు గ్రహణ సమయంలో ఏమి తినకూడదు, తాగకూడదు.

అలాగే గ్రహణ సమయంలో చంద్రుడిని చూడడం లేదా చంద్ర కాంతి త‌మ పై ప‌డ‌కుండా జాగ్రత్త పడాలట. ఆ రోజు గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదట. బయటకు వెళ్లే పనులు ఉన్నా మానుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెప్తున్నారు. గ్ర‌హ‌ణ సమయంలో గర్భిణులు ఏ పని చేయకుండా నిటారుగా పడుకుని ఉండాలి. పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం పడకూడదు అంటే.. కొన్ని సమస్యల నుంచి రక్షించుకోవడానికి గర్భిణీలకు కత్తి, సూది, కత్తెర లాంటి వస్తువులను దగ్గరగా ఉంచుకోవాలట.