చచ్చిపోయిన అమ్మ కోరిక తీర్చబోతున్న మహేశ్ బాబు..వైరల్ అవుతున్న లేటేస్ట్ న్యూస్..!!

మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా సెంటిమెంట్స్ ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు.  మరి ముఖ్యంగా కొన్ని ముహూర్తాలు కొన్ని డేస్ బాగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే అలాంటి మహేష్ బాబు తన అమ్మ చివరి కోరిక తీర్చలేకపోయాడు అన్న న్యూస్ ఈ మధ్యకాలంలో మనం విన్నాం.  మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా రీసెంట్ గానే మరణించారు.

అయితే ఆమె బ్రతికున్నంత కాలం సితారకు ఓణీల ఫంక్షన్ చేయించాలి అంటూ చాలా ఆశపడిందట . మొదటి నుంచి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేని మహేష్ బాబు ఇప్పుడే కాదు అంటూ నెగ్లెట్ చేస్తూ వచ్చారట.  అయితే ఆమె ఆ కోరిక తీరకుండానే చనిపోయింది . దీంతో చనిపోయిన తన తల్లి కోరిక తీర్చడానికి మహేష్ బాబు సితార ఘట్టమనేని ఓణీల ఫంక్షన్ చేయడానికి అంగీకరించారట .

నమ్రత సితారకు ఫంక్షన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఈ క్రమంలోనే నవంబర్ లో ఘట్టమనేని ఇంట  మొదటి శుభకార్యం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సితార ఘట్టమనేని కు అంగరంగ వైభవంగా ఫంక్షన్ జరిపించబోతున్నారట.  ఘట్టమనేని స్థాయిని తెలిపేలా ఓణీల ఫంక్షన్ చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!