ఈ సబ్బుతో స్కిన్ క్యాన్సర్ కు చెక్.. 14 ఏళ్ల ఓ అబ్బాయి అద్భుత ఆవిష్కరణ ఇది..

క్యాన్సర్ ఎంత భ‌యంకర‌మైన వ్యాధో అన్న సంగతి తెలిసిందే. అలాంటి భయంకర వ్యాధి క్యాన్సర్ లో ఎన్నో రకాల వేరియేషన్స్ ఉన్నాయి. వాటిలో స్కిన్ క్యాన్సర్ ఒకటి. అయితే స్కిన్ క్యాన్సర్ ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ప్రయోగానికి నాంది పలికాడు ఓ 14 ఏళ్ల కుర్రవాడు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన హేమంత్ బేకెలే.

స్కిన్ క్యాన్సర్ ను ఎవరైనా సులువుగా జ‌యించేందుకు అణువుగా ఓ సబ్బును కనిపెట్టాడు. అతి తక్కువ ఖర్చుతో మ‌ధ్య త‌ర‌గ‌తి వాడు కూడా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేలా.. స్కిన్ క్యాన్సర్ నయం అయ్యేలా ఈ సబ్బును రూపొందించాడు. కేవలం ఈ సబ్బు ధర రూ.800 మాత్రమే కావడం విశేషం. ఇక 14 ఏళ్ల వయసులోనే ఇంత తక్కువ ఖరీదుతో ఎంతో ఉపయోగకరమైన ఈ సబ్బును కనిపెట్టి టాప్ ఎండ్ సెంటిస్ట్‌గా అవార్డును అందుకున్నాడు హేమంత్ బెకెలే.

కాగా ఈ బాలుడికి పరిశోధనను సక్సెస్ సాధించడానికి అవసరమైన సమయంలో త్రిఎమ్‌ డిస్కవరీ ఎడ్యుకేషన్ సైంటిస్టుల సలహాదారు అయినా డాక్టర్ మహ్ఫుజ్‌ అలీ హెల్ప్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హేమ‌న్‌ పై నిటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు మ‌రెన్నో చేయాలని మధ్యతరగతి కుటుంబాలకు కూడా వైద్యం విషయంలో ఇది ఎంతగానో ఉపయోగపడతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.