నాని ” గ్యాంగ్ లీడర్ ” సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!!

నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తను చేసే ప్రతి ఒక్క సినిమాకి అభిమానులు ఫిదా అవుతారు. తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాని చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో తనతోపాటు ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది.

ఆ గ్యాంగ్ లో అన్నయ్య కోసం రివెంజ్ తీర్చుకునే పాత్రలో నటించిన అమ్మాయి చాలా అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. తన అమాయకమైన మాటలతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ అమ్మాయి పేరు శ్రియ రెడ్డి. ఇక ఈ సినిమా అనంతరం తను మరే సినిమాలు కనిపించలేదు. శ్రియ గ్యాంగ్ లీడర్ సినిమా అనంతరం ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా కనిపించలేదు. తను సోషల్ మీడియాలో కూడా టచ్ లో లేదు. ఎందుకంటే తను సినిమా షూటింగ్ అయిపోగానే అమెరికాకి వెళ్లి తన చదువును పూర్తి చేసుకుంది.

ఇక రీసెంట్గా తను ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీయ మాట్లాడుతూ దాదాపు నాలుగేళ్లు తర్వాత కెమెరా ముందుకి వచ్చాను అని చెప్పింది. ఇక ఈ అమ్మాయి గ్యాంగ్ లీడర్ సినిమాలో చాలా అమాయకంగా చిన్నపిల్లలాగా కనిపించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని అందంతో ఫోటోఘూట్లు చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. శ్రియ హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. ఇక ప్రస్తుతం తను సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనకి ఏ మేరకు సినిమా అవకాశాలు వస్తాయో చూడాలి మరి.