విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాకు బ్రేక్.. కార‌ణం ఏంటంటే..?

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన మూవీ మార్క్‌ అంటోని. వినాయక చవితికి రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సీజన్‌లో విడుదలవుతున్న ఒకే ఒక సినిమా మార్క్ అంటోని అన్న ఆనందం విశాల్ ఫ్యాన్స్ లో ఎంతో కాలం నిలవలేదు. హీరో గా, నిర్మాత విశాల్ న‌టించిన ఈ సినిమా విడుదల ఆపు చేయాలని కోర్ట్ ఆదేశాలు పంపినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. లైకా సంస్థలో ఉన్న ఆర్థిక లావాదేవీల ఫలితంగా ఈ సినిమాలు ఆపేయాలంటూ నోటీసులు వచ్చాయట.

 

ఇక అలాంటిదేమీ లేదని కొట్టి పారేయాలి అనుకునే సమయంలో కోర్ట్ ఆదేశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో మాట మార్చాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు చెన్నై వర్గాల టాక్. చాలా కాలంగా విశాల్‌ తన మార్కెట్‌ను పోగొట్టుకుంటూ వస్తున్నాడు. ఇక అత‌డు హీరోగా సరైన సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు తెలుగు నాట విశాల్‌ సినిమాలంటే ఓ సెట్ అప్ ఆడియన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు.

కానీ రాను రాను వారుస‌గా విశాల్ సినిమాలు నిరుత్సాహపరచడంతో సినిమాలపై ప్రేక్ష‌కుల‌లో ఆసక్తి పోయింది. అలాంటి టైమ్‌లో మార్క్ అంటోనీ మూవీ ట్రైలర్ కాస్త క్రేజీగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు పోటీగా వస్తున్న చంద్రముఖి 2, స్కంద సినిమాలు వాయిదా పడ్డాయి. ఇవన్నీ మంచి సకునాలు సినిమా ఖచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది అనే సమయంలో ఇప్పుడు కోర్టు కేసులో చిక్కుకుంది మూవీ. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ కావచ్చు కానీ దీని వల్ల సమస్య ఏంటంటే ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి బయ్యర్ల దగ్గర నుంచి సినిమాకు సంబంధించి డబ్బులు రిలాజ్ వ‌ర‌కు చేతికి అంద‌వు.