రైతుగా మారిన బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్.. ఇప్పుడు ఎలాంటి లైఫ్ గడుపుతున్నాడు అంటే..

శేఖర్ కముల దర్శకత్వం వహించిన ‘ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ‘ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అభిజిత్. ఆ తరువాత అరెరే, మిర్చి లాంటి కుర్రాడు, రామ్ లీలా, పెళ్లి గోల లాంటి సినిమాలో నటించాడు. ఇక బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ షో ద్వారా అభిజిత్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు . అయితే బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కెరీర్ పరంగా బాగా బిజీ అవుతాడని అంత అనుకున్నారు. కానీ బిగ్ బాస్ తర్వాత అభిజిత్ నటించిన వెబ్ సిరీస్ ఆశించిన రేంజ్ లో విజయం సాధించలేకపోయింది.

 

ప్రస్తుతం అభిజిత్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్గా  నిలిచిన అభిజిత్ ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం చేస్తున్నాడు. దానికి సంబందించిన వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చెయ్యగా ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అభిజిత్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ భారత్ మాతాకీ జై’ అంటూ ట్యాగ్ చేసాడు. ఇక అభిజిత్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు .

అభిజిత్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కాబ్బటి అభిజిత్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వల్ల తనపై వచ్చే నెగిటివ్ కామెంట్లకు అభిజిత్ ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంది. అభిజిత్ కెరీర్ పై ఫోకస్ పెడితే సినిమాలలో కీలక పాత్రల్లో నటించే అవకాశం సైతం అభిజిత్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ కథాంశాలతో అభిజిత్ కెరీర్ పరంగా ముందడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . రాబోయే రోజుల్లో అభిజిత్ కు కెరీర్ పరంగా కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.