చిరుతో మరో సినిమా తీసి సమాధానం చెబుతా.. అనిల్ సుంకర వాట్సప్ చాట్ లీక్..!

చిరంజీవి హీరోగా – మెహర్ రమేష్ డైరెక్షన్లో అనిల్ సుంకర నిర్మించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఇటీవల రిలీజై ప్లాప్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమా ప్లాప్ అవడంతో చాలామంది నెటిజ‌న్‌లు సినిమాపై పలు అపోహలను సృష్టించారు. చిరు కథను సరిగ్గా ఎంచుకోకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని.. ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో సినిమాలు తీయడం ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అంటూ.. మ్యూజిక్ సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణం అంటూ ఇలా పలు పుకార్లను సృష్టించారు.

 

అనిల్ సుంకర ఈ సినిమాతో భారీగా నష్టపోయాడని సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. సినిమా ఫ్లాప్ అయి బారి నష్టం రావడంతో అనిల్ సుంకర చిరంజీవి పై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడని న్యూస్ వైరల్ అయింది. చిరంజీవికి రెమ్యూనరేషన్ ఇచ్చేందుకే అనిల్ సుంకర తన ఆస్తులను అమ్ముకున్నాడని వార్త వైరల్ అయ్యాయి. ఇక భోళాశంకర్ పరాజయంపై అనిల్ మాట్లాడుతూ నిర్మాతకు నష్టం వస్తే తోడుగా ఉండేవాళ్లే అసలైన హీరోలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంత సీనియర్లు అయినా జీరోలే అలాంటి జీరోలు హీరో కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ చిరంజీవి పై అనిల్ సుంకర కామెంట్స్ చేశాడని వార్తల్లో రాసుకొచ్చారు.

దీంతో బాధపడిన ఓ మెగా అభిమాని అనిల్ సుంకరకు వాట్సప్ చేయగా నేను ప్రస్తుతం అమెరికా వెళుతున్నానని ఫ్లైట్లో ఉన్నానని ఇలాంటివి పట్టించుకోవద్దు.. ఇవన్నీ పుకార్లే.. నేను చిరంజీవి గారితో మరో సినిమా తీసి సమాధానం చెప్పబోతున్న చిరంజీవి గారు ఓ మంచి హ్యూమన్‌బీయింగ్‌ అంటూ అనిల్ సుంకర రిప్లై ఇచ్చాడు. అనిల్ సుంకర తో చాట్ చేసిన ఆ వ్యక్తి వాట్సాప్ స్క్రీన్ షాట్ ను గ్రూప్ ద్వారా షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.