పూర్వకాలం నుంచి భారతదేశం వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఇప్పటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు పెద్ద కంపెనీలు భారతదేశంతో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి. భారతదేశం సుగంధం ద్రవ్యాలు , పత్తి లాంటి పలు వ్యాపారాలు ప్రపంచానికి పరిచయం చేసింది. భరత గడ్డ పై ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు కూడా జన్మించారు.
వారిలో ఒకరు స్వాతంత్రామానికే వ్యాపారవేత్త, మరి ఈస్ట్ ఇండియన్ కంపెనీకే అప్పు ఇచ్చాడంటే అతడు సామాన్యుడు కాదు. ఆతడు ఎవరంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన విర్జి వోరా. ఆ సమయంలో అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మొఘల్ పాలనలో కూడా ఆయన ప్రజారాజ్యం తగ్గలేదు. అతను 1617-1670 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీకి మెయిన్ ఫైనాన్షియర్ కూడా.
అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి రూ.2 లక్షలు అప్పు ఇచ్చాడు.
గుజరాతి వ్యాపారవేత్త విర్జి వోరా 1590 లో జన్మించన ఇతడు 1670 లో మరణించాడు. కొన్ని నివేదికల ప్రకారం ఈయన టోకు వ్యాపారి ఆ టైంలో అతని వ్యక్తిగత సంపాదన రూ.8 మిలియన్స్. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ధనవంతులతో మనం అతని సంపాదనను లెక్కించుకుంటుంటే ప్రస్తుతం ఆయన సంపద ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. DNA నివేదిక ప్రకారం ఆ టైంలో విర్జి వోరా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. వీరి బిజినెస్‌లు భారతదేశం అంతట అలాగే పెర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియాలోని ఓడరేవు నగరాల్లో విస్తరించింది.