వైసీపీలో ఒకే టిక్కెట్ కోసం మూడు ముక్క‌లాట‌…!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంపై ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఒక క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా? ఇక్క‌డ ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాలి? ఎవ‌రికి వ‌ద్దు..? అనే విష‌యంపై పార్టీ నిర్ణ‌యం తీసుకుందా? అంటే.. ఔన‌నే గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ విద్యా వ్యాపార వేత్త మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో ఈ సీటును ఇస్తామ‌ని చెప్పినా.. బూచేప‌ల్లి ఫ్యామిలీ వ‌ద్దంది.

ఎందుకంటే.. ఏమో వైసీపీ గెలుస్తుందో లేదో.. అన‌వ‌స‌రంగా పోటీ చేసి చేతులు కాల్చుకోవ‌డం ఎందుక‌ని భావించిన మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌రెడ్డి పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించారు. దీంతో వైసీపీ మ‌ద్దిశెట్టి కి టికెట్ ఇచ్చింది. ఇదిలావుంటే, ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు వ‌చ్చి.. వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఈయ‌న కూడా త‌న వార‌సుడికి ఇక్క‌డ అవ‌కాశం క‌ల్పించాల‌ని భావిస్తు న్నారు.

గ‌తంలో టీడీపీలో ఉండ‌గా.. శిద్దా వార‌సుడిపై చ‌ర్చ జ‌రిగింది. కానీ, ఇప్పుడు త్రిముఖ పోటీ మాత్ర‌మే క‌నిపి స్తోంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. శిద్దా-మ‌ద్దిశెట్టి-బూచేప‌ల్లి వ‌ర్గాల్లో ఒక‌రికి మాత్ర‌మే టికెట్ ద‌క్క నుంది. అయితే.. వీరిలోనూ మూడు నాలుగు ర‌కాల వ‌డ‌పోత‌లు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికై తే.. శిద్దా రాఘ‌వ‌రావును ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పించి.. నామినేటెడ్ ప‌ద‌విని అప్ప‌గించే ప్రక్రియ సాగు తోంద‌ని అంటున్నారు.

ఇక‌, మ‌ద్దిశెట్టి వ్య‌వ‌హారంపై పార్టీ గుర్రుగానే ఉంది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే అయినా.. ఆయ‌న ఎక్క‌డా పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌కుండా. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు .. జ‌న‌సేన‌తోనూ ట‌చ్‌లో ఉన్నార‌నే చ‌ర్చ సాగుతోంది. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఆయ‌న‌ను దాదాపు ప‌క్క‌న పెట్టింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో బూచేప‌ల్లికి లైన్ క్లియ‌ర్ అయింద‌ని వైసీపీ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. అయితే.. ఇంకా టైం ఉండ‌డంతో చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.