ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులు ఉన్నారు. అందులో హీరోయిన్ల గానే కాకుండా దర్శకులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో మొదటి వరుసలో ఉంటుంది దివంగత నటి విజయనిర్మల.. 1946 ఫిబ్రవరి 22న తమిళనాడులో జన్మించిన ఈమె కోలీవుడ్ లో ఎంగ వీటు పిళ్లై అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విజయనిర్మల నటించిన తొలి సినిమానే అగ్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ వారు నిర్మించారు.
ఆమె మొదటి సినిమా కూడా ఇదే కావడంతో అప్పటికే చిత్ర పరిశ్రమలో నిర్మలమ్మ అనే మరో నటి ఉండటంతో ఆమె పేరుకు ముందు విజయని జత చేశారు. నిర్మలా కాస్త అప్పటినుంచి విజయనిర్మలాగా మారారు. టాలీవుడ్‌కు మంచి కుటుంబం అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యరు. అప్పటినుంచి తెలుగులో హీరోయిన్‌గా కూడా ఒక వెలుగు వేల గారు.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ముద్ర వేశారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డ్ కూడా ఎక్కారు. కృష్ణ నటించిన దేవదాస్ చిత్రానికి విజయనిర్మల దర్శకత్వం వహించారు.
విజయ్ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ కి రెండో భార్య అనే విషయం అందరికి తెలిసిందే.. ఈమెకు కూడా అదే రెండో వివాహమే.. కృష్ణతో సినిమాలు చేసే సమయంలోనే విజయనిర్మలకు కృష్ణమూర్తి తో పెళ్లి జరిగింది .
కృష్ణమూర్తి షిప్ డిజైనింగ్ ఆఫీసర్. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అతనే సీనియర్ హీరో నరేష్. ఇక కొడుకు పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విజయనిర్మల, కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కృష్ణకు దగ్గరగా ఉంటూ ఆయనను రెండో పెళ్లి చేసుకుంది. ఇలా విజయనిర్మల తన మొదటి భర్తకు దూరమైంది.