“ఆ తెలుగు హీరో పక్కలోకి రమ్మన్నాడు”.. షాకింగ్ కామెంట్స్ చేసిన అప్సర రాణి..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం మరింత స్థాయిలో ముదిరిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటేనే భయపడిపోతున్నారు అమ్మాయిలు . కాగా మరోసారి క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఆర్జీవి బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అప్సర. ఆయన తెరకెక్కించిన “డేంజరస్” అనే సినిమా ద్వారా ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ..నైనా గంగోలితో చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు . ఇప్పటికేకి యూట్యూబ్లో ఆ వీడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి అంటేనే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందులో లెస్బియన్ పాత్రలో హీటెక్కించిన అప్సర రాణి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరో తనని కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడు అని బిగ్ బాంబు పేల్చింది. ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ” నేను ఇండస్ట్రీలోకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చాను ..వచ్చినా కూడా ఎదుర్కొంటూనే ఉన్నాను.. సినిమాలోకి వచ్చిన కొత్తల్లో చాలామంది నన్ను కమిట్మెంట్ అడిగారు . కానీ నేను ఎవరికీ ఓకే చెప్పలేదు . ఒకవేళ ఓకే చెప్పుంటే ఇప్పుడు నా స్థానం ఏ పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ లో ఉండేది “.

“అయితే రీసెంట్గా తెలుగు హీరో కూడా సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడు ..సంబరపడిపోయాను .. అయితే తనతో తన కోరిక తీర్చాలని మేనేజర్ తో అడిగించారు . దీంతో షాక్ అయిపోయాను . అంత పెద్ద హీరో కూడా ఇలా కమిట్మెంట్ అడుగుతారా ..?అంటూ ఆశ్చర్యపోయాను.. అది నాకు నచ్చలేదు ..అందుకే సినిమా ఆఫర్ ని వదులుకున్నాను “అంటూ చెప్పుకొచ్చింది . దీంతో అప్సర రాని తన కోరిక తీర్చమన్న తెలుగు హీరో ఎవరు అంటూ జనాలు తెగ ఆలోచిస్తున్నారు..!!