రవితేజ- నేషనల్ క్రష్ రష్మిక కాంబినేషన్లో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో కొన్ని క్రేజీ కాంబినేషన్లో మిస్ అవుతూ ఉంటాయి. ఆ కాంబినేషన్లో సినిమాలు వస్తే మాత్రం అంచనాలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. సినిమాల్లో హీరో, హీరోయిన్ల జంట బాగుంటే ప్రేక్షకులకు కూడా ఆ సినిమా బాగా కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఆకాంబోతోనే సినిమా వస్తే సూపర్ హిట్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకుంటారు. అయితే ప్రతి కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పలేం.

కొన్ని సందర్భాల్లో సెట్ అవుతాయి అనుకున్న కాంబినేషన్లు కూడా సెట్ అవ్వవు. అలాగే కొన్ని క్రేజీ కాంబినేషన్లో ఆఖరి నిమిషంలో ఆగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ లిస్ట్ లోకే వస్తుంది రవితేజ- రష్మిక మందన్నా కాంబో. టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎటువంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగి తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.

అలాగే నేషనల్ క్రష్ రష్మిక గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వ‌రుస‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్ కు జంటగా నటించిన పుష్ప సినిమాతో భారీ విజయం అందుకుంది. అదే సమయంలో రవితేజ- రష్మిక కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చిందిట. అవకాశాన్ని రష్మిక మిస్ చేసుకుందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. రవితేజ తన కెరీర్లు వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నప్పుడు వచ్చిన సినిమా ధమాకా

 

 

ఒక విధంగా రవితేజ కెరీర్‌ను మళ్ళీ జోష్ పెంచిన సినిమా కూడా ధమాకానే ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి చేసిన యాక్టింగ్, డాన్స్ అన్ని కలిపి థియేటర్లో ప్రేక్షకుల దగ్గర నుంచి విజిల్స్ వేసేలా చేశాయి. అదేవిధంగా ఈ సినిమాలో వచ్చిన పాటలో శ్రీలీల స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా భారీ కలెక్షన్ సాధించి రవితేజ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇదే స‌మ‌యంలో ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారట. కానీ రష్మిక అదే సమయంలో వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న రష్మిక ఈ సినిమా చేస్తే మళ్ళీ తన క్రేజ్ తగ్గిపోతుందని భయంతో ధమాకా సినిమాకు నో చెప్పిందట. తర్వాత ఇదే అవకాశం శ్రీలీల‌కు దక్కింది. ఈ సినిమాతో శ్రీలీల‌ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో అందరికీ తెలిసింది. ఈ విధంగా మొత్తానికి ఓ క్రేజీ కాంబినేషన్ అయితే మిస్ అయిందని చెప్పాలి.