“క్లిం కారా” పుట్టిన వేళా విశేషం.. చిరంజీవికి ఏకంగా రూ. 2 వేల కోట్లు లాభం..కలలో కూడా ఊహించనిది ఇది..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవికి ఏకంగా 2000 కోట్లు లాభం వచ్చిందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం కూడా క్లీం కారా అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రైన విషయం తెలిసిందే . పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత ఉపాసన రాంచరణ్ మొదటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ .. మెగా ఫ్యాన్స్ .. కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే మెగా కుటుంబాన్ని ఆదరించే జనాలు కూడా పండగ చేసుకున్నారు.

కాగా ఈ క్రమంలోనే “క్లీం కార” పుట్టిన తర్వాత మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ..” మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని.. ఆమె రాకతో మా ఇంట్లో శుభకార్యాలు మొదలయ్యాయని ..రామ్ చరణ్ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అన్న ..వరుణ్ తేజ్ పెళ్లి కుదిరింది అన్న ..నా మనవరాలు వల్లే అంటూ చెప్పకు వచ్చాడు. అయితే అప్పట్లో జనాలు ఇది మరీ టూ మచ్ అంటూ వ్యంగంగా కౌంటర్ వేశారు .

అయితే ఈరోజు అవే కమెంట్స్ నిజమయ్యాయి . ఎవ్వరు ఊహించని విధంగా కోకాపేటలో భూమి ధర రికార్డు స్థాయికి చేరుకుంది . రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఓ సంచలనం అంటున్నారు బిజినెస్ నిపుణులు . ఎకరం భూమి ధర దాదాపు 100 కోట్లకు పైగానే దాటేసింది . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో కోకాపేటలో ల్యాండ్ ఉంది . అధికారిక లెక్కలు ఎప్పుడు బయటకు రాకపోయినా చిరంజీవి అక్కడ ఒకటి రెండు కాదు ఏకంగా 30 ఎకరాల భూమి ఉందట . ఈ క్రమంలోనే చిరంజీవికి కోకాపేట్ లో మొత్తం 2000 కోట్లకు పైగానే లాభం వచ్చింది అంటున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది..!!