చిరంజీవి కార్ల నెం.1111 ఉండ‌టం వెనుక ఇంత సిక్రెట్ దాగిఉందా..!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కోట్లాదిమంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి స్టార్ హీరోగా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. ఇటీవల భోళా శంకర్ సినిమాతో స్క్రీన్ పై కనిపించిన చిరంజీవి ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన చిరంజీవి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కార్లకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా స్పోర్ట్స్ కార్‌లంటే ఆయనకు ఎంత ఇష్టమని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కార్లు చాలా ఉన్నాయట. చిరంజీవి దగ్గర రోల్స్ రయిడ్‌ స్పెషల్ ఎడిషన్ కారు ఉంది. దీని విలువ సుమారు రూ.8 కోట్లని తెలుస్తుంది. దీంతోపాటే చిరంజీవి దగ్గర మెర్సేడెస్ బెంజ్, g63 amg, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ రోగ్ ఇలా టాప్ బ్రాండ్ కార్స్ అన్ని చిరంజీవి గారేజ్ లో ఉన్నాయి. చిరంజీవి కార్లకు మాత్రం దాదాపుగా 1111 నెంబర్ ఉంటుందన్న సంగతి చాలామందికి తెలుసు. అయితే చిరంజీవి అసలు ఆ నెంబర్ ని ఎందుకు అంత ఇష్టంగా పెట్టుకున్నారు అనే అంశం ఇప్పుడు వైరల్ అవుతుంది.

నెంబర్ 1 అనేది పోటీ తత్వాన్ని సూచిస్తుందని.. ఆ నెంబర్ చూసినప్పుడల్లా మనం ఇంకా కష్టపడాలని గుర్తు చేస్తుందనే ఉద్దేశంతో చిరంజీవి ఆ నెంబర్‌ని ఎప్పుడూ తన కారులకు వచ్చేలా చూసుకుంటాడట.
ఇక ఎప్పటినుంచో ఇదే నెంబర్ను తనకారులకు వచ్చేలాగా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు మెగాస్టార్. గ్యారేజ్ లో పార్క్ చేసిన కార్లు జాబితానే కొన్ని కోట్ల ఆస్తులు విలువ చేస్తాయని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా టయోటో వెల్ఫేర్ అనే మరో లగ్జరీ కార్ను తీసుకున్నడట చిరంజీవి. ఈ కారు విలువ అక్షరాల కోటి రూపాయలు.

ఈ టయోటా వెల్ఫేర్ కూడా చిరంజీవి 1111 అనే నెంబర్ ని తీసుకున్నాడు. ఈ ఫ్యాన్సీ నెంబర్ దాదాపు ఆయన రూ.5 లక్షలు పెట్టి కొన్నాడట. ఇక ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన 156, 157వ సినిమాల పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 156వ సినిమాను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన ఓన్ బ్యానర్స్ లో నిర్మిస్తుంది. ఈమె బ్యానర్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.