పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ” OG ” టీజర్ రిలీజ్ డేట్ పిక్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఋ పేరుకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మొదటి రోజు మొదటి షో కి థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. హిట్ ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ఆ సినిమా కలెక్షన్స్ వసూళ్లు చేస్తుంది. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్ గా రూపొందిన సినిమా బ్రో టాలీవుడ్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా మరో షెడ్యూల్ కోసం మేకర్స్ అబ్రాడ్ లో ఉన్నారు. ఇక ఇదే సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ పలు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ విదేశానికి వెళ్లే ముందే వన్ వీక్ వరకు ఉస్తాద్‌ భగత్ సింగ్ షూటింగులో పాల్గొంటారని తెలుస్తుంది. ఆ తర్వాత నెలరోజుల పాటు ఓజీ కోసం డేట్స్ కేటాయించాడట.

 

కాగా ఈ మూవీలో దర్శకుడు పవన్‌ని గ్యాంగ్ స్టార్ గా ఓ రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నాడు. ఇక ఫైట్స్ అయితే పవన్ కెరీర్‌లోనే ది బెస్ట్‌ల ఉంటాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. సెప్టెంబర్ 2 బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు వేచి చూడాలి.