మళ్లీ మల్లెమాలలోకి చమ్మక్ చంద్ర.. ఎంట్రీతోనే అదుర్స్

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగులోనే అత్యధిక రేటింగ్స్ కలిగిన కామెడీ షోగా ఇది పేరు తెచ్చుకుంది. దీంతో ఈ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లు ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్లకు సినిమాల్లోనూ అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో కామెడీ సన్నివేశాల కోసం జబర్దస్త్ కమెడియన్లనే పెట్టుకుంటున్నారు. దీంతో జబర్దస్త్ నుంచి వెళ్లి సినిమాల్లోనూ నటించిన కమెడియన్లు ఎంతోమంది ఉన్నారు.

జబర్దస్త్ నుంచి వెళ్లి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చమ్మక్ చంద్ర నటించాడు. అయితే వివిధ కారణాలతో జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లినవారు మళ్లీ మల్లెమాల నిర్వహిస్తున్న షోలోకి రావడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా చమ్మక్ చంద్ర కూడా మళ్లీ మల్లెమాలలోకి అడుగుపెట్టాడు. గతంలో నాగబాబు జబర్దస్త్‌ను వీడిన సమయంలో ఆయన వెంట చమ్మక్ చంద్ర కూడా వెళ్లాడు. స్టార్ మా, జీ తెలుగులో పలు షోలలో చేశాడు. అయితే ఆ షోలు ఎత్తివేయడంతో తిరిగి మళ్లీ మల్లెమాలలోకి చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు.

తాజాగా విడుదల చేసిన ప్రొమోలో చమ్మక్ చంద్ర కనిపించాడు. రాఖీ సందర్భంగా మల్లెమాల ప్రొడక్షన్స్ ఒక ప్రత్యేక షో చేసింది. ఇందులో చమ్మక్ చంద్ర అలరించాడు. సెట్ మారిందని, కానీ తాను మారలేదని చెబుతూ చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు. దీంతో స్టేజ్ దద్దరిల్లింది. అయితే త్వరలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కూడా చమ్మక్ చంద్ర కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రొమో చూసిన నెటిజన్లు.. చమ్మక్ చంద్ర తిరిగి కనిపించడం చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. చమ్మక్ చంద్రను చూసి చాలా రోజులు అయిందని, తిరిగి జబర్దస్త్ లోకి అడుగుపెడితే బాగుంటుందని అంటున్నారు.