నరేష్ ఒక దుర్మార్గుడు.. రెచ్చిపోయి కామెంట్స్ చేసిన నటుడు శివాజీ రాజా..!!

టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరుపొందిన శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా అమృతం సీరియల్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనరల్ సెక్రటరీగా వీకే నరేష్ పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా శివాజీ రాజా వికే .నరేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ప్రస్తుతం శివాజీ రాజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. శివాజీ రాజా మాట్లాడుతూ నరేష్ ఒక పెద్ద దుర్మార్గుడు ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ మొత్తం నాశనమే ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతారు తెలిపారు.. ఒకరోజు నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి చిరంజీవి, నాగార్జున గారు వస్తే నేను శ్రీకాంత్ వారిని ఆహ్వానించడానికి వెళ్లాను ఆ సమయంలో నరేష్ నా గురించి శ్రీకాంత్ గురించి మా చాంబర్లో ఒక సీన్ క్రియేట్ చేశారని తెలిపారు.

అందులో నేను శ్రీకాంత్ కలిసి విజయనిర్మల, కృష్ణ వస్తున్న లిఫ్టుని ఆఫ్ చేసామని ఒక అబద్ధపు వార్తను కూడా సృష్టించారు.. ఈ విషయాన్ని నేను శ్రీకాంత్ చాలా గట్టిగానే ఖండించాము అయినప్పటికీ నరేష్ ఆ విషయంలో భయపడలేదు .. అయితే ఈ విషయంలో నరేష్ శ్రీకాంత్ కి తనకు క్షమాపణలు చెబితే ఆయనను క్షమించి వదిలేస్తామంటూ కూడా శివాజీ రాజా తెలియజేయడం జరిగింది.. ప్రస్తుతం శివాజీ రాజ చేసిన ఈ కామెంట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.