భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల‌పై బీబీసీ సెటైర్లు.. చెప్పుతెగే ఆన్స‌ర్ ఇచ్చిన ఆనంద్ మ‌హీంద్రా

అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 3తో భారత్ స‌క్స‌స్‌ బ్రిటిష్ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. కనీస సదుపాయాలు కూడా లేని భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం ఎంత భారీ బడ్జెట్లో డబ్బు వెచ్చించడం అవసరమా అంటూ డిబేట్లు పెట్టి మరి ప్రశ్నిస్తుంది. అలా ప్రశ్నించిన బీబీసీ యాంకర్‌కు ప్రముఖ వ్యాపారవేత ఆనంద్ మహేంద్ర గుబ‌గుయ్యమనేలా కౌంటర్ ఇచ్చాడు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా అంతరిక్ష ప్రయోగాల‌లో చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టి భారతదేశమే మొదటి దేశంగా రికార్డులు సృష్టించింది.

చంద్రుడి వైపుగా భారత్ ప్రయాణం 41 రోజులు పాటు సాగిన సంగతి తెలిసిందే.. తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ గ్రాండ్ గా ముగించింది. రూ140 కోట్ల భారతీయుల హృదయాన్ని గర్వంతో ఆనందంతో నింపింది. భారత విజయాన్ని దాయాది దేశం పాకిస్తాన్, అమెరికాలు అభినందనలతో ముంచెత్తుతుంటే బ్రిటిష్ మీడియా సంస్థ బిబిసి మాత్రం మన విజయాన్ని చూసి కుళ్లుకుంటుంది. భారతీయ 700 మిలియ‌న్‌ల‌ మందికి కనీసం మరుగుదొడ్లు కూడా లేవు అలాంటి పేదరికంలో అన్న దేశం అంతరిక్ష ప్రయోగానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టాలా అని ప్రశ్నిస్తూ బీబీసీ డిబేట్ లు పెడుతోంది. అలా ఓ బీబీసీ యాంకర్ భారత్ సక్సెస్ స్టోరీ పై చేసిన‌ వ్యాఖ్యలు తన ట్విట్టర్ వేదికగా ఇలా షేర్ చేశాడు వ్యాపారవేత ఆనంద్ మహేంద్ర.

నిజం ఏంటంటే పేదరికం దశాబ్దాలు వలస పాలన ఫలితం.. ఎంతో ఖరీదైన ఆస్తిక్ కోహినూర్ వజ్రమే కాదు, మా నమ్మకాన్ని, శక్తి సామర్థ్యాన్ని కూడా దొంగిలించారు. అలాంటి మీరు మరుగుదొడ్లు, అంతరిక్ష అన్వేషణ పెట్టుబడులపై మమ్మల్ని ప్రశ్నించే అర్హత కూడా లేదు. ఇది మీ వైఖరికి అద్దం పట్టినట్లు ఉంది. మేము చంద్రుడి పైకి వెళ్లడం మా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. పరిశోధన రంగంలో మరింత మెలకువలు సాధించేందుకు మాపై మాకు నమ్మకాన్ని కలిగించి పేదరికం నుంచి బయటపడేయాలని కోరికనిస్తుంది. పేద‌రికం అంటే కోరికలు కూడా పేదరికం కలిగి ఉండడమే అంటూ ఆనంద ఘాటైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.