” 7/జి బృందావన్ కాలనీ ” తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనియా అగర్వాల్. టాలీవుడ్, కొలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్త సల్వా రాఘవన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సెల్వ రాఘవన్ మొండి పట్టుదల ఉన్న వ్యక్తి .. కాని పర్సనల్ లైఫ్‌లో మాత్రం అలాంటి వ్యక్తి కాదని సోనియా అగర్వాల్ కామెంట్ చేసింది.
స్ట్రిక్ట్ వర్క్ ఇతర విషయాల్లో సెల్వ రాగవన్ ఎప్పుడు తనదైన లోకంలో ఉండేవాడని ఆమె వివరించింది. ఒకసారి పెళ్ళై భార్యా,భర్తలుగా మారి విడిపోయిన తర్వాత మళ్లీ వారి ఫ్రెండ్స్‌గా ఎలా ఉంటారో నాకైతే తెలియదని.. నేనైతే అలా జీవితంలో ఎప్పటికీ ఉండలేనని చెప్పుకొచ్చింది. సెల్వ రాగవన్ నా కంటికి మళ్లీ జీవితంలో స్నేహితుడిగా కనిపించడం సాధ్యం కాదని వివరించింది. పెళ్లి సమయంలో నాకు సెల్వరాగవన్ కుటుంబం యాక్టింగ్ చేయడం మానేయాలని అభ్యంతరం పెట్టిందని వివరించింది.
ఆ కారణంగానే నేను సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చాను అని చెప్పుకొచ్చిన సోనియా భర్తతో విడిపోయిన తర్వాత నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను అని వివరించింది. అయితే గతంలో
‘ 7/జి బృందావన్ కాలనీ ‘ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్ళీ దీనికి సీక్వెల్ గా రాబోతున్న ” 7/జి బృందావన్ కాలనీ 2 ” తో ప్రేక్షకుల ముందుకు రానున్నానని చెప్పుకొచ్చింది.