చీరలో కూడా అందాలతో మత్తెక్కిస్తున్న అదితి రావు హైదరి..!!

మొదట మోడల్ గా తన కెరీయర్ని మొదలుపెట్టిన హీరోయిన్ అదితి రావు హైదరి.. ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడు ఎక్కువగా ముంబై ప్రాంతానికి చెందిన అమ్మాయి అనుకున్నారు.. కానీ ఇమే పక్కా హైదరాబాద్ అమ్మాయి. కేవలం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఫ్యాషన్ ప్రపంచంలో మంచి క్రేజ్ ను అందుకున్నది.ఆ తరువాతే బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది అదితి రావు హైదరి..

మొదట హిందీలో ఎక్కువ సినిమాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది..తెలుగులో అవకాశాలు రావడంతో ఈమె ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయమే పట్టింది..అలా మొదటి సినిమా సమ్మోహనం సినిమాతో మంచి క్రేజ్ ను అందుకుంది.ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అంతరిక్షం ,వి ,మహాసముద్రం వంటి సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్ తో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం తెలుగులో కూడా పెద్దగా సినిమాలలో నటించక పోయిన ఇమే బాలీవుడ్లో ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను షేర్ చేసిన అదితి రావు హైదరి.. తాజాగా చీర కట్టులో ఘాటైన లుక్స్ తో కనిపించి అందరిని ఆకట్టుకునేలా చేస్తోంది. ఈసారి చీర ఫోటోషూట్ లో మాత్రం మరింత అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్ కు గట్టి ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం చీరలో కూడా అందాలతో అదితి రావు హైదరి మత్తెక్కిస్తోంది అంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)