తెలుగు సినిమా స‌త్తా… “RRR” కి జపాన్లో 500వ రోజు కూడా హౌస్ ఫుల్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ RRR. ఈ సినిమా భారీ హిస్టారికల్ పాన్ ఇండియా సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సంగతి తెలిసిందే. రౌద్రం, రుదిరం, ర‌ణం అనే టైటిల్ తో భారీ అంచనాల నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ వైడ్‌గా అద్భుతమైన సక్సెస్ సాధించింది.

ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. అయితే జపాన్ దేశంలో త్రిబుల్ ఆర్ సినిమా ఇప్ప‌టికి థియేటర్స్ లో రన్ అవుతుంది. మరి ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 500 కి పైగా రోజులను కంప్లీట్ చేసుకుంది. ఇక జపాన్లో అయితే ఇంకా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డ్ పడుతూనే ఉంటుందట.

దీంతో ఈ హ్యాపీ మూమెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మూవీ మేకర్స్. మొత్తానికి ఇంకా త్రిబుల్ ఆర్ హవా మామూలు రేంజ్ లో లేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తెలుగోడి సత్తా అంటే ఇలా ఉంటుంది. త్రిబుల్ ఆర్ మాన్య అంటే ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు నెట్టిజ‌న్స్