క్లాక్స్ దర్శకత్వంలో ప్రముఖ యంగ్ హీరో కార్తికేయ, బోల్డ్ బ్యూటీ నేహా శెట్టి తాజాగా నటించిన చిత్రం బెదురులంక 2012.. ఇందులో అజయ్ ఘోస్, రాజ్ కుమార్ కసిరెడ్డి , గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీలకపాత్రలు పోషించారు.. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించగా.. ఈరోజు ఈ సినిమా థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల అయింది. మరి ఈ సందర్భంగా కార్తికేయ తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకున్నాడు.. కథ ఏమిటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
బెదురులంక 2012 సినిమా విషయానికి వస్తే.. 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామానికి చెందిన శివ అనే ఒక స్వేచ్ఛ జీవి తన మనసుకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటాడు. హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్ గా జాబు ఉన్నా కూడా మానేసి బెదురులంకకు వస్తాడు. అయితే అప్పటికే అక్కడి యుగాంతం రాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక టీవీలో యుగాంతం పై వస్తున్న వార్తలను చూసి భూషణం అనే వ్యక్తి ఊరి జనాలను మోసం చేయడానికి పెద్ద ప్లాన్ చేస్తాడు. ఇక ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బతికే బ్రాహ్మణుడు బ్రహ్మం, చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు. అంతేకాదు యుగాంతాన్ని ఆపేయాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని.. దాంతో శివలింగాన్ని, శిలువలను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని ప్రజలను నమ్మబలుకుతారు.
ఇక ప్రజలంతా కూడా నిజం అని నమ్మి బంగారాన్ని ఇవ్వడానికి వెళ్తారు. కానీ శివ మాత్రం కొట్టి పారేస్తాడు. దీంతో ప్రెసిడెంట్ శివ ను ఊరి నుంచి వెళ్లేస్తాడు.. ఆ తర్వాత ఏం జరిగింది? ఊరి ప్రజల మూఢనమ్మకాన్ని శివ పోగొట్టడానికి ఏం చేశాడు? భూషణం ప్లాన్ ని ఎలా బయటపెట్టాడు ? ఇలా ప్రతి విషయం సస్పెన్షన్గా సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి.ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు మరొకవైపు కమెడియన్లు తమ కామెడీతో నవ్వులు పూయిస్తారు. ముఖ్యంగా కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇబ్బంది పెట్టిన ఓవరాల్ గా సినిమా మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పాలి. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.