ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఐఎమ్‌డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత ప్రథమ స్థానం సొంతం చేసుకుంది. ఐఎమ్‌డీబీ 2022లో అత్యంత ప్రజాధరణ పొందిన భారతీయ తారలను ప్రకటించగా సమంత మొదటి స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్, ప్రభాస్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను సైతం వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఇదే జాబితా గతంలో విడుదల చేయగా తొమ్మిదో స్థానంలో నిలిచిన సమంత.. ఇప్పుడు ఏకంగా అగ్రస్థానంలో నిలిచింది.
ఈ లిస్టులో మరో అందాల భామ పూజా హెగ్డే కూడా 17వ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో సమంతకు అగ్రస్థానం రావడం ఆమె క్రేజీకి నిదర్శనంగా మారింది. గత సంవత్సరం అల్లు అర్జున్ కు జంటగా పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ’ సాంగ్ చేసి క్లాస్ మాస్ ఆడియన్స్ ని మరోసారి మెలిపెట్టేసింది.. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ను షేక్ చేసింది.. మొన్నటి వరకు మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడి కాస్త కోలుకుని తిరిగి సినిమాలతో బిజీ అయింది.
రీసెంట్ గానే శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సమంత రాజ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ వెబ్ సిరిస్‌తో బాలీవుడ్ లో పాగా వేయాలని ఆలోచనతో సమంత ఎంతో కష్టపడుతుందట.. అంతేకాకుండా ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి సినిమాలో నటిస్తుంది. మరి సమంత రాబోయే రోజుల్లో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.