`రామ‌బాణం`కు సాలిడ్ బిజినెస్‌.. గోపీచంద్ హిట్ కొట్టాలంటే ఎంత రాబ‌ట్టాలి?

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నారు.

ఇక‌పోతే ఈ సినిమాకు సాలిడ్ బిజినెస్ జ‌రిగింది. నైజాంలో రూ. 4.5 కోట్లు, సీడెడ్ లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల‌కు రామ‌బాణం థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేయ‌గా.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 12.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల రేంజ్ లో రామ‌బాణం బిజినెస్ చేసింది. అంటే గోపీచంద్ ఈ సినిమాతో హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద‌ రూ. 15.20 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

Share post:

Latest