లైవ్ లో నోరు జారి నాలుక కరుచుకున్న వెంకీ.. అంత మాటనేశాడేంటి?

దుగ్గుబాటి హీరోలు వెంక్ట‌రీ వెంకటేష్‌, రానా ద‌గ్గుబాటి `రానా నాయుడు` వెబ్ సిరీస్ ద్వారా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చారు. అమెరిక‌న్ డ్రామా సిరీస్ రే డొనోవ‌న్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సూప‌ర్న్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సిరీస్ తాజాగా రిలీజైంది.

రియ‌ల్ లైఫ్ లో బాబాయ్‌, అబ్బాయి అయిన వెంకీ, రానా.. ఈ వెబ్ సిరీస్ లో తండ్రీకొడుకులుగా న‌టించారు. యాక్ష‌న్ అంశాల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ మేళ‌వించి రూపొందించిన సిరీస్ ఇది. ఫ్యామిలీ డ్రామా అయిన‌ప్ప‌టికీ ఈ వెబ్ సిరీస్ ను సింగిల్ గా చూడ‌ట‌మే మంచిది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక‌పోతే ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రానా, వెంకీ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యాడు.

ఈ సంద‌ర్భంగా వెంకీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. `మీ ఇంట్లో ల్యాప్‌ ట్యాప్ లు, ఫోన్లలో ఈ సిరీస్ చూస్తుంటే మీ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు పూర్తిగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఇందులో కామెడీ, హింస, సె*క్స్ కూడా ఉన్నాయి` అంటూ నోరు జారాడు. ఆ తర్వాత అయ్యో చెప్పేశానా అంటూ నాలుక కరుచుకున్నాడు. దాంతో అక్క‌డున్న వారంతా తెగ న‌వ్వేశారు. వెంకీ నోటి నుంచి అటువంటి మాట వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదనే చెప్ప‌వ‌చ్చు.

Share post:

Latest