హోటల్లో గిన్నెలు తోమిన స్టార్ యాక్టర్.. అతని హిస్టరీ తెలిస్తే..!!

 

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది నటీనటులు సినిమాలోకి రాకముందు, రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కష్టాల గురించి వారంతట వారు చెప్తేనే మనకు తెలుస్తుంది. సినిమాలలో నటించే అవకాశం కోసం తిండి తిప్పలు మాని ఎంతో కష్టపడి వచ్చిన వారు చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మంచి స్థానాలలో ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కూడా ఆ కోవకు చెందినవాడే. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాలో అజయ్ ఒక పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో నటించాడు. దాని తరువాత ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అజయ్. లక్ష్మీ కళ్యాణం నుంచి ఇంకా అతను చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు.

అంతేకాకుండా కొన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇలా ఇండస్ట్రీ లో మంచిగా ఎదుగుతున్న సమయం లో ఆయన జీవితంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఒకసారి ఆయన ఒక హోటల్‌లో ఎంగిలి ప్లేట్లు కూడా కడగాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయానా అజయ్ యే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అజయ్ మాట్లాడుతూ తాను ఒకసారి నేపాల్ కి వెళ్లానని, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయని.. ఇండియాకి రావడానికి తన వద్ద దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని.. ఇక ఆ సమయంలో ఒక టిబెటన్ రెస్టారెంట్ లో కస్టమర్స్ తిన్న ఎంగిలి ప్లేట్స్ కడగాల్సి వచ్చింది అని చెప్పి షాక్ ఇచ్చాడు.

“డబ్బు చేతిలో ఉన్నప్పుడు దాని విలువ ఎవరికీ తెలియదు. కానీ డబ్బు కావాలంటే మాత్రం వాటిని సంపాదించడానికి ఎంతో కష్టపడాలి” అని ఆయన వివరించారు. అంతేకాకుండా విలన్ పాత్రలో నటించేటప్పుడు తనకి చాలా గాయాలు అవుతుంటాయని అజయ్ చెప్పి తన సినీ కెరీర్‌లో ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పకనే చెప్పేసాడు.