హీరోయిన్ రాశి ఖన్నా ఇన్ని చిత్రాలను రిజెక్ట్ చేసిందా..?

మొదటపలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లుగా నటించి ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ రాశి ఖన్నా. తన మొదటి చిత్రంతోనే బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకి పాత్ర నచ్చకపోవడంతో పలు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అందులో చాలా సినిమాలు హిట్ అయినవి ఉండడం గమనార్హం .వాటి గురించి తెలుసుకుందాం.

Rashi Khanna Age, Height, Earning, Films, Affairs and More

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు చిత్రం హీరోగా శర్వానంద్ నటించారు. ఇందులో హీరోయిన్ గా మొదట రాశి ఖన్నా నే అడగగా పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిన దీంతో ఆ అవకాశం మెహరీన్ కి వెళ్ళింది.ఇదే కాకుండా f-2 సినిమాలోని హనీ పాత్ర కూడా ముందు రాశి ఖన్నా కే అనుకున్నారట. కానీ రాశి మాత్రం ఆ క్యారెక్టర్ నచ్చలేక ఒప్పుకోవడంతో ఈ అవకాశాన్ని కూడా వదులుకుంది. ఆ తర్వాత మిస్ చేసుకున్న మరొక చిత్రం గీతా గోవిందం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు.

Rashi Khanna bags a big Bollywood offer - TeluguBulletin.comఈ సినిమాలో రష్మికకు ముందు రాశికె ఆఫర్ ఇచ్చారట. కానీ ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండడంవల్ల ఈ చిత్రాన్ని వదులుకుంది. అలా రస్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాలో అనుపమకు ముందు ఆఫర్ రాశి ఖన్నా కే రాగా కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసిందట. ఇక నాగచైతన్య నటించిన మజిలీ సినిమాలో దివ్యాంక కౌశిక్ నటించిన పాత్ర రాశి కే అడిగారంట.. కానీ ఆ పాత్ర చేయనని చెప్పిందట ఇవే కాకుండా తమిళంలో శింబు నటించిన మానాడు, మహాసముద్రం , సర్కారీ వారి పాట సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చిందట. ఇలా అన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ని వదులుకుంది ఈ ముద్దుగుమ్మ.