Project-k నుంచి అతిపెద్ద అప్డేట్ రాబోతోందా..!!

వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -k. ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోగా ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ , దిశాపటాని కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఇప్పటికే 75% పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

PRABHAS NEXT PROJECT K TO RELEASED IN SEQUEL - Filmybowl Best Telugu Files  News, Telugu Fil Updates, Film News Updates, Tollywood News Updates
నాగ్ అశ్విన్ త్వరలో ఈ సినిమా నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందని తప్పకుండా అందరూ ఊహించిన దానికంటే చాలా పెద్దగా ఉంటుందని తెలిపారు. దాదాపుగా ఈ సినిమాని రూ .500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. విఎఫ్ ఎక్స్ చాలా అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం ఇదివరకే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ ని మిక్కీ జేయేయర్ అందిస్తూ ఉన్నారు. 2023 లో ఈ సినిమా విడుదల ఉంటుంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అభిమానులు మాత్రం ఆయేడాదైన సినిమా విడుదల చేస్తారా అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Project K latest update: Here's what Nag Ashwin revealed about Prabhas &  Deepika Padukone's film | Regional-cinema News – India TV

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా డీలక్స్ సినిమా కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మహానటి సినిమాతో డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ -k తో పాను వరల్డ్ వైడ్ గా సత్తా చాటబోతున్నారని తెలుస్తోంది బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు మరి సినిమా ప్రభాస్ రేంజ్ను పెంచుతుందేమో చూడాలి.