హీరో చేస్తానని చెప్పి ఆ డైరెక్టర్ మోసం చేశారు ..నిఖిల్..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యం తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా సులువు అని చెప్పవచ్చు. కానీ వారి టాలెంట్ ఆధారంగానే ఇండస్ట్రీలో నిలబడడం లేదా .. వెళ్లిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే కాస్త కష్టతరమే అని చెప్పవచ్చు. ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నవారు చాలామందే ఉన్నారు.అలాంటి వారిలో హీరో నిఖిల్ కూడా ఒకరు.

It's official now! Tollywood actor Nikhil Siddharth to enter Wedlock
ఈయన సినిమాల పైన ఆసక్తితో కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సీరియల్స్ లోను నటిస్తూ పలు అవకాశాల కోసం ఎదురు చూశారట. ఇలా కెరియర్ మొదట్లో ఎంతో కష్టపడి అవకాశాలను అందుకున్న నిఖిల్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇకపోతే తాజాగా 18 పేజీస్ అనే చిత్రంలో నటించిన నిఖిల్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నిఖిల్ తన సినిమా గురించి తన కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తాను చదరంగం సీరియల్స్ 40 వ ఎపిసోడ్ లలో నటించానని అయితే ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటానని చెప్పి ఆడిషన్స్ కి వెళ్ళానని తెలిపారు. చాలామంది ఆడిషన్ చేసిన తర్వాత అవకాశాలు ఇస్తానని ఫోన్ చేశారు కానీ ఆ సినిమాలో ఆగిపోయాయి ఒకానొక సమయంలో హీరోగా రావాలి అంటే రూ .5లక్షలు డబ్బులు కట్టాలని చెప్పడంతో రూ .5 లక్షలు కూడా ఖర్చు చేశానని తెలిపారు. కానీ సినిమా షూటింగ్ కాకుండానే మధ్యలో ఆగిపోయిందని తెలిపారు. ఇక నన్ను చూడగానే ఆ పాత్రకు తానే కరెక్ట్ గా సెట్ అవుతానని నాకు అవకాశం ఇచ్చినవారు శేఖర్ కమ్ముల గారు ఒక్కరే అని తెలిపారు. ఇక ఈ డైరెక్టర్ చేతిలో మీదే పాతికవేల చెక్కు తీసుకున్న తాను ఇప్పటికీ ఆ చెక్కును అలాగే భద్రంగా ఉంచాలని తెలిపారు.