టాలీవుడ్‌లోనే ఎందుకిలా.. 4 నెలల కాలంలోనే నలుగురు దిగ్గజ నటులు మృతి!

గత 4 నెలల సమయంలోనే టాలీవుడ్‌లో దిగ్గజ నటులుగా పేరుతెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరసనాటన సార్వభౌమ కైకాల సత్య నారాయణ, సీనియర్ నటుడు చలపతిరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇలా వరుసగా లెజెండరీ యాక్టర్స్ కన్నుమూయడం ఫ్యాన్స్‌ను తీవ్ర శోక సంద్రంలో ముంచెత్తుతోంది.

చలపతిరావు 1966లో గూఢచారి సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి 1200కి పైగా సినిమాల్లో డిఫరెంట్ వేషాలు వేసి తనదైన ముద్ర వేసుకున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలరించాడు. అలాంటి గొప్ప యాక్టర్ 2022, డిసెంబర్ 24న 78 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు.

రెబల్ స్టార్‌ కృష్ణంరాజు బాక్టీరియా ఫంగల్ న్యుమోనియాతో బాధపడుతూ చివరికి గుండెపోటుతో సెప్టెంబర్ 11 న 82 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ ఏడాది నవంబర్ 15న కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సఫర్ అయిన ఆయన గుండెపోటుతో 79 ఏళ్ల వయసులో చనిపోయారు. ఈ బుర్రిపాలెం బుల్లోడి మరణం చాలామందిని కలిచివేసింది. నవంబర్ 16న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి.

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా వేషం ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసే నటించిన కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23న కన్నుమూశారు. యముడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సత్యనారాయణ మరణం టాలీవుడ్‌ ప్రేక్షకులను ఎంతగానో బాధ పెట్టింది. ఇలా 4 నెలల్లోనే నలుగురు స్టార్స్‌ ప్రాణాలను దేవుడి తీసుకెళ్లి ఫ్యాన్స్‌కి ఎంతో బాధను మిగిల్చాడు.