భానుమ‌తి చెపితే జ‌రిగి తీరాల్సిందేనా… ఈ సెంటిమెంట్ మీకు తెలుసా..!

మన పాత తరం సీనియర్ హీరోయిన్స్ లో భానుమతి కూడా ఒకరు.. ఈమె గురించి ఇప్ప‌టి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ పాత తరం వారు ఈమెను ఊరికినే గుర్తుపట్టేస్తారు. ఇక ఈమె 1939లో మొదటిసారిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరవిక్రయం అనే సినిమాతో నటించి మెప్పించింది. ఆ తర్వాత కృష్ణప్రియ, స్వర్గసీమ వంటి సినిమాలతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ సినిమాలతో ఈమె చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోయింది.

Bhanumathi Ramakrishna - Prema - Rangshilp

 

భానుమతి కేవలం నటిగానే కాకుండా సింగర్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో అధినేతగా ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకుంది ఈ సీనియర్ నటి. అప్ప‌టీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలతో సమానంగా ఉండే పాత్రల‌ను ఎంచుకుంటూ తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది. భానుమతి తన మనసులో ఏ విషయాం ఉన్నా అది కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది.

motherindia: Dr.Bhanumathi Ramakrishna

తనకు అబద్ధాలు అంటే అసలు పడదు.. మొహమాటం లేకుండా ఎవరు తప్పు చేసినా వారిని చడమడ తిట్టేస్తుంది. ఈమె ఇలాంటి నైజం కలిగి ఉండటంతో ఈమెను చూసిన వారు ఎక్కువ మంది పొగరు అని కూడా అనుకునేవారు. ఆమె మాత్రం తన మాటల్లో తన వ్యక్తిత్వంలో ఎప్పుడూ ఒకేలాగే ఉంది.
భానుమతి తెలుగు తో పాటు తమిళ్లో కూడా ఎన్నో సినిమాలలో నటించింది. ఈమె 1943లో తమిళ నిర్మాత మరియు దర్శకుడైన పిఎస్ రామకృష్ణ రావును వివాహం చేసుకుంది. ఆ తర్వాత నుండి భానుమతి రామకృష్ణగా తన పేరును మార్చుకుంది.

Bhanumathi Ramakrishna: Multiple Talents And Signature Arrogance |  #IndianWomenInHistory

భానుమతికి సినిమాలతోపాటు జ్యోతిష్యంలో కూడా మంచి అనుభవం ఉంది. ఇక దాంతో ఈమె ఏది చెప్పినా కచ్చితంగా జరిగేది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దిగ్గజ నటుడు ఎంజీఆర్ కి సైతం 20 ఏళ్ల క్రితమే నీకు రాజ పరిపాలన యోగం ఉంది అని ముఖ్యమంత్రి కావటానికి 20 సంవత్సరాలు ముందే ఓ సినిమా షూటింగ్లో భానుమతి ఆయన చేతి రేఖలు చూసి చెప్పింది.

ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆ విషయం భానుమతి మర్చిపోయిన ఎంజీఆర్ గుర్తుంచుకునీ ఆ విషయాన్ని మళ్ళీ భానుమతికి గుర్తు చేశారు. ఆ విధంగా అప్పటిలో జ్యోతిష్య శాస్త్రంలో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉండేది. ఎందరికో జ్యోతిష్యం చెప్పింది. వారి జీవితంలో భానుమతి గారు చెప్పిన జ్యోతిష్యం నిజమైందని చెప్పడానికి ఏది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.