ప్రియుడి బ‌ర్త్‌డే.. రొమాంటిక్ పిక్‌తో విషెస్ తెలిపిన ర‌కుల్‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది త‌న బ‌ర్త్‌డే నాడు జాకీతో ప్రేమ విష‌యాన్ని ర‌కుల్ ఓపెన్ గానే బ‌య‌ట పెట్టింది. పెళ్ళికి మాత్రం ఇంకా టైం ఉందని చెప్తున్న ఈ జంట‌.. టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు.

త‌బాలీవుడ్ డిన్నర్‌ డేట్‌లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. అలాగే ర‌చూ వెకేష‌న్స్‌కు వెళ్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నేడు జాకీ భగ్నానీ బ‌ర్త్‌డే. నిన్న రాత్రి జాకీ భగ్నానీ పుట్టిన రోజు వేడుకలను ముంబైలో గ్రాండ్ గా జ‌రిగాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్ త‌దిత‌రులు జాకీ బ‌ర్త్‌డే పార్టీలో సంద‌డి చేశారు.

రకుల్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. ఇక తాజాగా జాకీతో దిగిన ఓ రొమాంటిక్ పిక్ ను ఇన్‌స్టా ద్వారా పంచుకున్న ర‌కుల్‌.. `శాంటా నా జీవితానికి ఉత్తమమైన గిఫ్ట్ ను అందించాడు. అది నువ్వే. ఈరోజు మై లవ్ జాకీ భగ్నానీ బ‌ర్త్‌డే కావడం సంతోషంగా ఉంది. ఎప్పటికీ నీవెంటే న‌డుస్తాను. అలాగే నువ్వు కోరుకున్నవన్నీ జయించాలని ఆకాంక్షిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ ప్రియుడికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది. దీంతో ర‌కుల్ పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CmlbesLNYvE/?utm_source=ig_web_copy_link