సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ . కాగా రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన గోపీచంద్ – ప్రభాస్ ప్రోమో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకున్న ప్రభాస్ ఫస్ట్ టైం తెలుగు టాక్ షో కి రావడం ఇదే కావడంతో హ్యూజ్ రేంజ్ లో వ్యూస్ దక్కించుకుంది.
ఈ క్రమంలోనే ప్రోమోలో ప్రభాస్ తో పాటు ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ గోపీచంద్ కూడా ఉండడం.. ఎదురు గా లెజెండ్ స్టార్ బాలయ్య ఉండడం ప్రోమోకే హైలెట్గా మారింది. అయితే ఈ ప్రోమోలో గోపీచంద్ “అది 2008 అనుకుంటా సార్” అంటాడు. దీంతో ఆ 2008 ఏంటా అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది . గోపీచంద్ ఫాన్స్ ఆయనకు తగ్గట్టు ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన తగ్గటూ కామెంట్స్ చేస్తూ చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలోని అనుష్క పేరు రివిల్ అయింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి 2008లో శౌర్యం సినిమాలో గోపీచంద్ తో నటించింది. అంతేకాదు 2009లో బిల్లా సినిమాలో ప్రభాస్తో నటించింది. కాగా ఒక హీరోయిన్ కోసం గోపీచంద్ – ప్రభాస్ కొట్టుకున్నారని న్యూస్ గతంలో వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ అనుష్క అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా 2008లో గోపీచంద్ శౌర్యం సినిమా షూటింగ్ టైంలోనే బిల్లా సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఇదే క్రమంలో అనుష్క కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోట్లాడుకున్నారు అంటూ న్యూస్ వినిపించాయి. కాగా ఎట్టకేలకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్య ఇచ్చిన హింట్ ని డీకోడ్ చేస్తూ.. 2018 సీక్రెట్ ను రివిల్ చేసి ప్రభాస్ – గోపీచంద్ పట్ల తమకున్న ప్రేమను ప్రూవ్ చేసుకున్నారు . మరి చూడాలి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాలు బయట పడతాయో..?