టాలీవుడ్ యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు , పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ..ఇప్పటివరకు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు . నార్మల్ యావరేజ్ హిట్గా నిలిచింది . మరీ ముఖ్యంగా సినిమాలో రోషన్ నటనకంటే శ్రీలీల నటన బాగుంది అంటూ కామెంట్స్ వినిపించాయి . అంతేకాదు స్టార్ హీరో సైతం మొదటి సినిమాలో శ్రీలీల నటించిన నటనకు మంత్రము ముగ్ధులయ్యారు.
ఈ క్రమంలోనే ఆమెకు ఏకంగా బడా బడా హీరోలు కూడా తమ సినిమాలో అవకాశమిచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ,మహేష్ బాబు ,ప్రభాస్, రవితేజ,నితిన్, బాలయ్య సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల-మహేష్ బాబు సినిమా నుంచి అవుట్ అయినట్లు తెలుస్తుంది. సినిమా కోసం హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కాకుండా ..షూటింగ్ షెడ్యూల్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టిందట.
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాసరావు.. శ్రీ లీలను భరించలేక ఆమెను సినిమా నుంచి తీసేసిన్నట్లు క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో కూడా శ్రీ లీల..నేను మహేష్ బాబు ఫ్యాన్ అని.. ఆయనతో ఒక్క సినిమా అయిన నటించాలని చెప్పుకొచ్చింది . ఇదే క్రమంలో ఫేవరెట్ హీరో సినిమాకి ఎన్ని కండిషన్స్ పెట్టిందా అంటూ జనాల ఆశ్చర్యపోతున్నారు. ఇలాగే కొనసాగితే శ్రీ లీల మరింత ఎత్తుకు ఎదగలేదు అంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు.