ఓర్నీ.. బిగ్ బాస్ నుంచీ గీతూ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదా..!

తాజాగా బిగ్ బాస్ ఆరవ సీజన్ తెలుగులో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 9వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్స్ ప్రక్రియలో భాగంగా గీతూ రాయల్ ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అందరూ కూడా ఈమె ప్రవర్తనే ఈమె ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యింది అంటూ కూడా కామెంట్లు చేశారు. బిగ్ బాస్ లో గీతూ తప్పకుండా ఫైనల్ కు చేరుకుంటుంది అని , టైటిల్ విన్నర్ కూడా ఈ లేడీ సింఘం అని అందరూ తమ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అనుకోకుండా ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవ్వడమే కాకుండా గీతూ ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఏమిటి అని కూడా ఆరా తీయడం గమనార్హం.Geetu Royal Wiki, Biography, Age, Real Name, Family, Movies List,  Relationship, Bigg Boss Telugu 6 And More - BBTV

ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య పెట్టిన టాస్క్ లో కంటెస్టెంట్స్ వీక్ పాయింట్ తో స్ట్రిప్స్ గెలుచుకోవాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. ఈ క్రమంలోనే గీతూ బాలాదిత్య వీక్ పాయింట్ ను పట్టుకొని రెండు స్ట్రిప్స్ ఇస్తే సిగరెట్ ఇస్తా, రెండు స్ట్రిప్స్ ఇస్తే లెటర్ ఇస్తా అంటూ అతడిని తీవ్రంగా ఏడిపించింది. అంతేకాదు బాలాదిత్య ఏడవడం చూసి ఈమెపై అందరూ నెగిటివ్గా కామెంట్లు చేశారు. దీంతో అక్కడ నెగెటివిటీని మూటగట్టుకున్న గీతూ రాయల్ ఆ తర్వాత ఎవరు ఏమన్నా గీతూనే నమ్ముకుని అక్క అంటూ ఆమె వెనకే తిరిగిన ఆదిరెడ్డిని కూడా మోసం చేసింది. ఆది రెడ్డి టీ షర్టును దాచేసి ఆదిరెడ్డికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసింది గీతూ రాయల్. ఎట్టకేలకు కోపోద్రిక్తుడైన ఆదిరెడ్డి కూడా.. కచ్చితంగా నువ్వు ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది అంటూ కామెంట్లు చేశాడు. అందరూ అనుకుంటున్నట్టుగా నెగిటివిటీ కారణంగా గీతూ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వలేదు.

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పుష్ప సినిమా ద్వారా గీతూ బాగా పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని పుష్ప 2 షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకానున్న నేపథ్యంలో ఆమె ఈ షో నుంచి తానే ఎలిమినేట్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో కానీ గీతూ ఇంటర్వ్యూ ఇస్తే తప్ప తెలియదు.

 

Share post:

Latest