వావ్: మరో అర్జున్ రెడ్డి..ఆ సూపర్ హిట్ రీమేక్ లో జూ.విజయ్ దేవరకొండ..!!

రీసెంట్ గా వచ్చిన డీజేటిల్లు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ. తన కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు కూడా నటించాడు. ఆడపాడప సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. డీజే టిల్లు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. దీనికి సిక్వెల్‌ కూడా తీస్తానని కూడా సిద్దు చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుంది.
ఇప్పుడు సిద్దు మరో సినిమాకు కామెంట్ అయినట్టు తెలుస్తుంది. మలయాళం లో రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన‌ తుల్లుమల సినిమా రీమేక్ లో నటిస్తున్నాడట.

Siddhu Jonnalagadda - Movies, Biography, News, Age & Photos | BookMyShow

ఈ రీమేక్ లో సిద్దు హీరోగా కన్ఫర్మ్ అయినట్టు టాలీవుడ్ లో టాక్. ఈ సినిమా కూడా మరో అర్జునరెడ్డి అంతా హిట్ అవుతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మలయాళం లో ఆ సినిమాను ఖాలీద్ రెహమాన్ తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కూడా వర్కౌట్ అవుద్దని తెలిసిన వెంటనే మేకర్స్ ఆ సినిమా రైట్స్ తీసేసుకున్నారు. మలయాళం లో ఆ సినిమాలో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శిని నటించారు. తెలుగులో సిద్దుకు జోడిగా ఎవరు నటిస్తారో చూడాలి. డీజే టిల్లు సిక్వెల్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టులో సిద్దు జాయిన్ అవుతాడు.

Share post:

Latest