సమంత జీవితాన్ని ఊహించిన మలుపు తిప్పబోతున్న… స్టార్ డైరెక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించాడు. ఆయన ఎక్కువ శాతం ప్రేమ సినిమాలే డైరెక్ట్ చేశాడు. తాజాగా గౌతమ్‌ మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ఆయ‌న‌ మాట్లాడుతూ ఓటిటి వచ్చాక ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం మానేశారు. ఏదైనా పెద్ద సినిమా వస్తేనే తప్ప థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించ‌ట్లేదు. దిని వ‌ల్ల ఎక్కువ చిన్న సినిమాలు ఓటీటీలో విడుదల చేయటానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఐతే సినిమాలు గురించి నిజంగా చెప్పాలంటే సినిమాకి భాష లేదు. ఏ భాష నుంచి వచ్చిన ప్రేక్షకుడి కి నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాని ఆదరిస్తున్నాడు. అని గౌతమ్ మీన‌న్‌ చెప్పుకొచ్చాడు’.

Gautham Menon on 'The Life of Muthu', 'Ye Maya Chesave 2', teaming up with  Venkatesh & Ram - Telugu News - IndiaGlitz.com

తాజాగా గౌతమీనన్ శింబు హీరోగా గ్యాంగ్ స్టర్ అనే సినిమాని తెరకెక్కించాడు. ‘ఈ సినిమా తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు అని టైటిల్ తో తెలుగులో ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రాబోతుందిని. ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్‌ చెప్పాడు’. ఈ క్రమంలోనే గౌతమ్ మీన‌న్‌ సమంత- నాగచైతన్య గురించి ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘నేను ఇప్పుడు నాగచైతన్య సమంతతో కలిసి ఏం మాయ చేసావే సినిమాకి సీక్వెల్ చేయాలనుకుంటున్నానని. ఇందులో వారు ఇద్దరు నటిస్తారని గౌతమ్ మీనన్‌ చెప్పాడు’. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగచైతన్య -సమంత ముందుగా ఏం మాయ చేసావే సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారానే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని చెప్పవచ్చు.

మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయాక మళ్లీ ఆ సినిమాకి సీక్వెల్ చేయడం అనేది గొప్ప విషయమే. ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఇదే హాట్‌ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సమంత నాగచైతన్యతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాదా ఒప్పుకోదా…?, లేదా వేరే హీరోయిన్ పెట్టి తీస్తే హిట్ అవుతుందా…?, సమంత నాగచైతన్య కాకుండా వేరే హీరోతో చేస్తానని కండిషన్ పెడుతుందా…? అంటూసోషల్ మీడియాలో ఈ ర‌క‌మైన‌ కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి ఏం జరిగిందో.

Share post:

Latest