‘బ్రహ్మాస్త్రం’ ప్రీమియర్ రివ్యూ: స్టోరీ హిట్..సినిమా ఫ్లాప్..!!

హ..హ..హ.. పైన పటారం లోన లొటారం ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. పైన ఏమో సూపర్ గా ఉంటుంది కానీ.. లోపల ఏమో దరిద్రంగా ఉంటుంది . ప్రజెంట్ ఇదే సామెతను బ్రహ్మాస్త్రం సినిమాకి అప్లై చేస్తున్నారు జనాలు . భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ బ్రహ్మాస్త్రం. మల్టీ టాలెంటెడ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్టర్ చేశారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు . అంతేకాదు షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర ద్వార జనాలని మెప్పించారు. అలియా, రణబీర్ పెళ్లి తర్వాత కలిసి మొదటిసారిగా కనిపిస్తున్న సినిమా బ్రహ్మాస్త్రం కావడంతో బాలీవుడ్ లో కూడా వీళ్ళ కెమిస్ట్రీపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకి సమర్పికుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళి సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి . మరి ఇన్ని ప్రమోషన్స్ చేసిన బ్రహ్మాస్త్రం సినిమా జనాలనిపించిందా..? పూర్తి రివ్యూ చదవండి మీకే అర్థమవుతుంది


బ్రహ్మాస్త్రం టైటిల్ మాత్రం బ్రహ్మాండంగా పెట్టారు ..స్టోరీ కూడా అయాన్ ముఖర్జీ అదిరిపోయే రేంజ్ లో రాసుకున్నాడు.. ప్రస్తుతం లవ్, అట్రాక్షన్, రొమాంటిక్ ,యాక్షన్ అంటూ సాగే సినిమాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ అలాంటి జోనర్ ని టచ్ చేసి అయాన్ ముఖర్జీ సాహసం చేశారనే చెప్పాలి . అంతేకాదు తనవరకు తాను ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. తాను రాసుకున్న స్టోరీని జనాలకు పూర్తిగా అర్థమయ్యే విధంగా తెరకెక్కించాడు. ఆయన రాసుకున్న స్టోరీకి తగ్గట్లే నటించారు అలియా భట్, రణబీర్ కపూర్ ,నాగర్జున ,అమితాబచ్చన్ , షారుక్ ఖాన్.

భారీ అంచనాల నడుమ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ బ్రహ్మాస్త్రం సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఓవర్గం ప్రేక్షకులను బ్రహ్మాస్త్ర సినిమా ఆకట్టుకుంటే ..మరో వర్గం జనాలను మాత్రం ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది. మరీ ముఖ్యంగా సినిమాలో ఓవర్ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారంటూ సినిమాకి లేనిపోని హైప్ క్రియేట్ చేయడానికి కోట్లు ఖర్చు చేసారంటున్నారు. అంత ఎఫెక్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదని..అయాన్ ముఖర్జీ రాసుకున్న స్టోరీకి నార్మల్ ఎఫెక్ట్స్ చాలా బాగుండేటివి అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ చేయడం కూడా మైనస్ గా మిగిలిందని అంటున్నారు జనాలు. స్టోరీ కొత్తదే అయిన చాలామందికి తెలియకపోయినా సింపుల్ లైన్ ని జనాలు అర్థమయ్యే విధంగా తెరకెక్కించాడు అయాన్ ముఖర్జీ.. కానీ సినిమాలో కొన్ని అర్థం కాని సీన్స్.. అర్థం కాని విధంగా ఉండే విజువల్ ఎఫెక్ట్స్.. అసలు ఇప్పుడు ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ అవసరమా..? అన్న పాయింట్ తో జనాలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సినిమాకి లేనిపోని హంగామా చేసుకొని ఉన్న మంచి పేరుని కాస్త చెడగొట్టుకుంటుంది బ్రహ్మాస్త్రం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం ఆశ్చర్యకరం.

ఓవరాల్ గా సినిమా మొత్తం శివుడి కాన్సెప్ట్ పైనే తెరకెక్కింది. ఒక్క లైన్ ని అయాన్ ముఖర్జీ తనదైన స్టైల్ లో సినిమా స్టోరీ గా మలిచాడు. కధ బాగున్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని భారీగా దెబ్బెశాయి. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియా చేసిన కామెంట్స్ కూడా సినిమాకు భారీ నష్టాన్ని తీసుకొచ్చాయి. మొదటి నుంచి బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అంటూ సాగిన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది. కొందరైతే ఓపెన్ గానే లాల్ సింగ్ చద్దా కన్నా కూడా ఈ సినిమా దరిద్రంగా ఉందని.. బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ బ్రహ్మాస్త్ర అని కామెంట్ చేయడం సంచలనంగా మారింది. అంతే కాదు దయచేసి ఈ సినిమాను చూడకండి రా బాబు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మరి చూడాలి కలెక్షన్స్ పరంగా బ్రహ్మాస్త్ర ఏ మేరకు నెట్టుకొస్తుందో..?