అన‌సూయ‌కు ఇది మామూలు టార్చ‌ర్ కాదుగా… త‌ట్టుకోలేక‌పోతోందా…!

ఉన్నట్టుండి ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ఎక్కువగా ఆంటీ..ఆంటీ.. అంటూ గోల పెడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోల మీదే.. ఆంటీ.. ఆంటీ అని ఓవర్ లాక్ వాయిస్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కేవలం అనసూయ భరద్వాజను ట్రోల్ చేసే కార్యక్రమమే తప్ప వేరే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. నిన్నటికి నిన్న ఎవరి పేరు ప్రస్తావించకుండా ఏ సినిమా పేరు చెప్పకుండా.. ఒక సెటైరికల్ ట్విట్ వేసింది అనసూయ. దీంతో అప్పటినుంచి ప్రారంభమైంది ఈ యుద్ధము. ఈ యుద్ధంలో ఆంటీ అన్న పదం రామాయణంలో పిడకల వేటగా మారింది.anasuyabharadwaj - Twitter Search / Twitterఆంటీ.. ఆంటీ అంటూ తన ఏజ్ గురించి బాడీ షేమింగ్ గురించి పలు రకాలుగా ట్రోల్ చేయడంతో.. అనసూయ ఈ విషయం పైన చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. దీంతో మరింత రెచ్చిపోయారు నెటిజన్లు.. నిన్నటి నుంచి అనసూయ ఆమె యాంటీ.. ఆంటీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీట్ ల వార్ మొదలైందని చెప్పవచ్చు.. ఇక ఇలాంటి సమయంలోనే వీరి మధ్య శ్రద్ధాదాస్ కూడా ఎంట్రీ అవ్వడంతో ఓ రేంజ్ లో ఈమెను కూడా ఆడేసుకుంటున్నారు. నిజానికి నిన్నటికి నిన్న అనసూయ పోస్ట్ పెట్టిన తర్వాత అలా వదిలేసి ఉంటే సరిపోయేది..now trending on social media aunty memes on anasuya bharadwaj heres whyకానీ తనను ట్రోల్ చేసిన వారిని బ్లాక్ చేసుకున్న పోయేది.. అలాకోకుండా వ్యవహారాన్ని ఆంటీ వైపు మళ్ళించడంతో ట్విట్టర్ బ్యాచ్ హడావిడిగా హద్దు లేకుండా చేస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రోలర్స్ ఎక్కడెక్కడ నుంచి వీడియోలు తీసుకువచ్చి ఇలాంటివి షేర్ చేస్తూ ఉన్నారు. వాటిలో అనసూయ చేసిన వీడియోలు కూడా ఉండడం మరింత స్పెషల్ గా అనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ట్విట్టర్ లో అనసూయ పైన చాలా హడావుడిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. మరి ఇప్పటికైనా ఈ ట్రోలర్స్ ఆపుతారేమో చూడాలి.

Share post:

Latest