పెళ్లయ్యే వరకు కంట్రోల్ లో ఉండు గురూ! వరుణ్ ధావన్ పై ట్రోల్స్ వైరల్..!

ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటించిన చాలా వరకు అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. వరుసగా ఈయన ఈమధ్య కాలంలో ప్రేమ కథ , కుటుంబ కథ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు.Varun Dhawan, Kiara Advani spoke to friends 'getting divorced' for JugJugg  Jeeyo - Hindustan Times

ఇక ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ ధావన్ నటించిన చిత్రం జుగ్ జుగ్ జీయో .. గత జూన్ 24వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని కూడా అందుకుంది. ముఖ్యంగా అనిల్ కపూర్ , నీతూ కపూర్ సైతం కలసి నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మరొక రికార్డు సృష్టించింది.ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ ధావన్ కు జోడిగా కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం వీరిద్దరూ ఇటీవల ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫోటో షూట్ లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకొని స్టిల్స్ ఇస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఆయన కీయారా బుగ్గపై చాలా రొమాంటిక్గా ముద్దు పెట్టాడు..

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోషూట్ వీడియోని కూడా ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి అంటూ రాసుకు వచ్చాడు కూడా. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా ఇలా అయితే కష్టం గురు.. పెళ్లయ్యే వరకు జర ఆగు.. అంటూ పలువురు నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్స్ , కామెంట్స్ చేస్తున్నారు.

pic.twitter.com/3SzXU6M5WR

Share post:

Latest