ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు..షాకింగ్ విషయాని బయటపెట్టిన నమ్రత..!!

అమ్మ.. ఈ పదానికి మించిన గొప్ప పదం సృష్టిలో మరొకటి లేదు. అమ్మ అనే ఈ పదం చాలా గొప్పది.. విలువైనది.. వెలకట్టలేనిది. ఈ పదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఆడపిల్ల తన లైఫ్ లో అమ్మ అని పిలిపించుకోవడానికి ట్రై చేస్తుంది.. ఇష్టపడుతుంది. అఫ్కోర్స్ అమ్మవడం అంత ఈజీ కాదు. అమ్మ అని పిలిపించుకోవడానికి.. దాని వెనక పడాల్సిన కష్టం ఎంతో ఉంటుంది. ఆ పెయిన్, ఆ బాధ, ఆ నొప్పి , ఆ ఫీలింగ్ , ఆ సంతోషం ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది.

ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఓ టైం లో ఈ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తుంది. ఎవ్వరైనా అమ్మ అని పిలిపించుకోవడానికి ఇష్టపడకుండా ఉంటారా..? అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రతి ఆడపిల్ల తాపత్రౌఅ పడుతుంది. దాని కోసం ఎంతో కష్టపడుతుంది. అయితే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అక్క.. స్టార్ హీరో కూతురు అమ్మ అని పిలిపించుకోవడానికి బాధపడిందంట.. నిజానికి పిల్లల్ని కనడం ఆమెకు నచ్చదట,, ఇష్టం లేదట.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? స్టార్ హీరో మహేష్ బాబు అక్క స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల. యస్ ఈ విషయాన్ని స్వయానా మహేష్ బాబు భార్య నమ్రతనే చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నమ్రత..తన ఆడపడుచు మంజులకి పిల్లలు అంటే ఇష్టం లేదని ..మొదట పిల్లలు కనడానికి భయపడిందని.. ఆ తర్వాత నెమ్మదిగా పిల్లలు కన్నాక ..అమ్మలోని విలువని.. అమ్మ అని పిలుపులోని గొప్పతనాన్ని అర్థం చేసుకుందని చెప్పుకొచ్చింది.
మంజుల ఘట్టమనేని గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆమె పలు సినిమాలో నటించి.. తనలోని టాలెంట్ ని బయటపెట్టింది. కానీ ఆమె టాలెంట్ సినీ ఇండస్ట్రీ గుర్తించలేకపోయింది . ప్రస్తుతం సినీ నిర్మాణం వైపు అడుగులు వేస్తూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన జీవనాన్ని కొనసాగిస్తుంది.

Share post:

Latest