మహేష్ కాదన్నాడు.. చైతూ బ్లాక్ బస్టర్ కొట్టాడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుచేత అంటే ఈయన అంద మే ఈయనకు ప్లస్ గా మారుతుంది. ఇక ఎంతోమంది అభిమానులను కూడా తన డైలాగులతో మైమరిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇక నాగచైతన్య కూడా జోష్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో మంచి పేరు సంపాదించారు చైతన్య. ఈ సినిమాని డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించడం జరిగింది.It's Official: After Naga Chaitanya, next Mahesh Babuఈ సినిమాని తమిళ హీరో శింబుతో తెరకెక్కించాడు. అక్కడ జెస్సీ పాత్రలో హీరోయిన్ త్రిష నటించిఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేయకుండా రీమిక్స్ చేయాలని డైరెక్టర్ భావించారు. అందుచేతనే మొదట ఈ సినిమాను నాగచైతన్యకు వినిపించలేదు. మొదట మహేష్ బాబుకు ఈ సినిమా కథ వినిపించారు. అయితే ఈ సినిమా కథ విన్న తర్వాత మహేష్ బాబుని కచ్చితంగా ఈ సినిమా చేయాలని సూచించారట గౌతమ్ మీనన్. దాంతో మహేష్ బాబు కూడా గౌతం మీనన్ చెప్పిన కథను ఓపిగ్గా విన్నాడు.. మహేష్ కు కథ అయితే బాగా నచ్చిందట. కానీ తన స్టార్ ఇమేజ్ కి ఈ సినిమా కథ సెట్ కాదని భావించడంతో ఈ సినిమాని వద్దనుకున్నాడట.Ye Maya Chesave (2010) | Background Score | 10 years | A.R. Rahman |  Gowtham Menon | Samantha | - YouTube

ఇక అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ సినిమాతో గౌతమ్ మీనన్ ఈ సినిమా కథను నాగచైతన్యకు చెప్పి ఒప్పించాడు. ఇక ఈ సినిమాతోనే సమంత హీరోయిన్గా మొదటిసారి పరిచయమైంది. అయితే మొదటి సినిమా అయినప్పటికీ సమంత కూడా మొదట ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. కానీ గౌతమ్ మీనన్ పట్టుబట్టి ఈ సినిమాలో సమంతను ఒప్పించాడట. అలా ఫైనల్ గా సమంత చేతులతో ఏం మాయ చేసావే సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు గౌతమ్ మేనన్.

Share post:

Latest