సమంతతో భవిష్యత్తులో నటించడం పై క్లారిటీ ఇచ్చిన చైతూ..!

నాగ చైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో జోడిగా నటించిన నాగచైతన్య ఒక బలమైన విజయాన్ని కూడా సొంతం చేసుకోకపోవడం గమనార్హం. ఇక తన మేనమామ అయినటువంటి వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరీ ముఖ్యంగా తన భార్య సమంతతో వివాహం తర్వాత చేసిన సినిమా మజిలీ.. ఇది కూడా బాగా విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత సాయి పల్లవి తో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు . అంతేకాదు నాగచైతన్య సినీ కెరియర్ లో ఇదొక మైలురాయి అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమాలో నాగచైతన్య నటించి వరుస హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.Samantha Akkineni, Naga Chaitanya on what sets Majili apart and working  together after marriage-Entertainment News , Firstpostఇక ప్రస్తుతం థాంక్యూ సినిమాలో నటించినప్పటికీ పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో బాలరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య కూడా కొన్ని విషయాలు వెల్లడించడంతోపాటు తన మాజీ భార్య సమంతతో భవిష్యత్తులో కలిసి నటించడం పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదివరకే ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్న వీరు విడాకులతో దూరమయ్యారు ఇక ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితుల్లో కూడా లేరని చెప్పాలి.Naga Chaitanya, Samantha Akkineni fulfill this 'romantic' dream, know  interesting details

ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్యకు సమంతతో భవిష్యత్తులో కలిసి నటించాల్సి వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి సమాదానంగా.. “భవిష్యత్తులో మేమిద్దరం కలిసి నటిస్తామో.. లేదో నాకు కూడా తెలియదు.. అది కాలమే నిర్ణయిస్తుంది.. ఒకవేళ మేమిద్దరం మళ్ళీ సినిమాలలో నటించే అవకాశం వస్తే అది క్రేజీనే అవుతుంది”.. అంటూ చైతూ తెలిపారు.