పవన్ సీటు ఫిక్స్..మరి విజయం!

పవన్ కల్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం జనసేన శ్రేణులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి…ఈ సారి పవన్ ఎక్కడ బరిలో ఉంటారు…అలాగే ఈ సారి గెలుస్తారా?అనే ప్రశ్నలపై రకరకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సారి పవన్ ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకచోట పోటీ చేయొచ్చని కొన్ని సార్లు కథనాలు వచ్చాయి..లేదు లేదు చిరంజీవి గెలిచిన తిరుపతిలో పోటీ చేస్తారని మీడియాలో ప్రచారం జరిగింది…మరొకసారి నరసాపురం అని..కాదు కాదు కాకినాడ సిటీ లేదా రూరల్ లో పోటీ చేయొచ్చని..అలాగే భీమిలిలో కూడా పోటీ చేయొచ్చని…ఇంకా పిఠాపురంలో కూడా పోటీ చేయొచ్చని రకరకాలుగా పవన్ సీటుపై ప్రచారం జరుగుతూ వచ్చింది.

Ground report: In Andhra's Bhimavaram, locals peg their hopes on Pawan Kalyan | The News Minute

అయితే ఓడిన చోటే మళ్ళీ గెలిచి చూపించాలని పవన్ భావిస్తున్నారని, ఎక్కువ శాతం భీమవరంలోనే పోటీ చేయొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది…ఇక తాజాగా ఈ విషయంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పవన్…భీమవరం నుంచే బరిలో దిగుతారని మీడియాతో చెప్పారు. పార్టీలో అధికారికంగా చర్చ జరిగాకే…జిల్లా అధ్యక్షుడు గోవిందరావు ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

అంటే పవన్ భీమవరంలో పోటీ చేయడం ఖాయం…మరి విజయం సాధిస్తారా? అంటే ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…గత ఎన్నికల్లో అదే సీటులో 8 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయారు…మళ్ళీ ఇప్పుడు అక్కడే  బరిలో దిగుతున్నారు…పైగా గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉంది..ఇప్పుడు అది కాస్త తగ్గింది. దీంతో పవన్ విజయానికి దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోంది…కానీ త్రిముఖ పోరులో పవన్ గెలుపు కాస్త కష్టం..అదే టీడీపీతో గాని పొత్తు పెట్టుకుంటే పవన్ విజయం ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి పవన్ ఈ సారి సత్తా చాటుతారో లేదో?